పెంచికల్ పాడ్​లో చిరుత సంచారం

కుంటాల, వెలుగు: కుంటాల మండలంలోని పెంచికల్ పాడ్ శివారులో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఊరి సమీపంలో ఉన్న ఓ మొక్క జొన్న చేను నుంచి చిరుత బయటకు రావడాన్ని గుర్తించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు పాదముద్రలను పరిశీలించిగా చిరుతగా నిర్ధారించారు. పరిసర గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారిణి హరిలత సూచించారు.