సరస్వతి దేవికి మొక్కకపోతే చదువు రాదా

గుడిలో సారీ చెప్పించిన వీహెచ్​పీ లీడర్లు
నిజామాబాద్​ జిల్లా కోటగిరిలో ఘటన 


కోటగిరి : నిజామాబాద్​ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జడ్‌‌‌‌‌‌‌‌పీహెచ్‌‌‌‌‌‌‌‌ఎస్ లో తెలుగు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున్ ​స్టూడెంట్లకు దేవుళ్లు లేరని పాఠాలు చెబుతున్నారని ఆరోపించారు. టీచర్​ సారీ చెప్పాలని స్కూల్​ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా వీహెచ్‌‌‌‌‌‌‌‌పీ నాయకులు పార్వతి మురళి, మరికొందరు బజరంగ్‌‌‌‌‌‌‌‌దళ్ కార్యకర్తలు, బీజేపీ లీడర్లు  మాట్లాడుతూ ‘మల్లికార్జున్​ దేవుళ్లు లేరని పిల్లలకు పాఠాలు చెబుతున్నరు. సరస్వతి దేవికి మొక్కకపోతే చదువు రాదా అని మాట్లాడుతున్నరు. అమెరికా లాంటి దేశాల్లో సరస్వతీ దేవిని పూజిస్తారా వాళ్లకు చదువులు రావడం లేదా అని స్టూడెంట్లను అడుగుతూ తప్పు దారి పట్టిస్తున్నరు’ అని అన్నారు.

టీచర్  తన వైఖరి  మార్చుకోవాలని హెచ్చరించారు. తమ వెంట వచ్చి గుడిలో సారీ చెప్పకపోతే సస్పెండ్ చేయాల్సిందేనని పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి ఆందోళన విరమించాలని నచ్చజెప్పారు. అందరి ముందు టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్షమాపణలు చెబితేనే విరమిస్తామన్నారు. చివరకు టీచర్ సారీ చెప్పడానికి​ఒప్పుకోవడంతో ఆయనను స్కూల్ నుంచి గుడి వరకు దేవుడి పాటలతో ర్యాలీగా తీసుకువెళ్లారు. అక్కడ ఎంఈఓ నాగనాథ్​ సమక్షంలో దేవుడి ముందు క్షమాపణలు చెప్పించారు