కూసుమంచి, వెలుగు : కూసుమంచి ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో సోమశేఖర్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు.
పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అందరూ10 జీపీఏ సాధించాలని సూచించారు. కార్యక్రమంలో కుసుమంచి ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ రేలా విక్రం రెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.