సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి పిలుపు

సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం: టీబీజీకేఎస్ ప్రెసిడెంట్ మిర్యాల రాజిరెడ్డి పిలుపు

గోదావరిఖని, వెలుగు: సింగరేణి సంస్థను ప్రైవేటుకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలపై.. అందుకు వంత పాడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకెఎస్​) అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గోదావరిఖనిలో యూనియన్​ కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బొగ్గు పరిశ్రమను అమ్మకానికి పెట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై మండిపడ్డారు. ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ సంఘాలు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

భూగర్భ గనుల్లో కూడా ప్రైవేటీకరణ పెరిగిపోయిందని, ఓసీపీ గనుల్లో బొగ్గు తీసే పని కూడా కాంట్రాక్టర్లకు అప్పగించారని ఆయన ఆరోపించారు. సింగరేణి బొగ్గు పరిశ్రమ రక్షణకు దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని, కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి కె.సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపెల్లి రవి, ఎల్​.వెంకటేశ్​, వడ్డేపల్లి శంకర్, ఐలి శ్రీనివాస్, నాగెల్లి సాంబయ్య  పాల్గొన్నారు.