TikTok షట్ డౌన్ అయిన కొన్ని గంటల తర్వాత యూఎస్ కస్టమర్లకో తిరిగి సేవలను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఫ్లాట్ ఫాం ను నిషేధించే చట్టం అమలులోకి రాకముందే కాలపరిమితి పెంచుతామని హామి ఇవ్వడంతో అమెరికాలోని 17 కోట్ల మంది టిక్ టాక్ యూజర్లకు సేవలను పునరుద్ద రించింది.
సోమవారం (జనవరి 20,2025) అధికారంలోకి రాగానే సోషల్ మీడియా యాప్ యాక్సెస్ ను పునరుద్ధరిస్తామని ట్రంప్ చెప్పారు. టిక్ టాక్ పై బైడెన్ ప్రభుత్వ ఉత్తర్వులతో యూఎస్లో టిక్ టాక్ ను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిన కొన్ని గంటల తర్వాత.. ఈ చైనా సోషల్ మీడియా సంస్థ ట్రంప్ హామీతో కుషీ అయింది.. ట్రంప్ కు థ్యాంక్స్ చెప్పింది.
170 మిలియన్ల అమెరికన్లకు టిక్ టాక్ అందించడం, 7 మిలియన్లకు పైగా చిన్న వ్యాపారాల అభివృద్దికి హామీతో ఇచ్చారు.. అమెరికాలో టిక్ టాక్ ఉంచేందుకు అధ్యక్షుడు ట్రంప్ తో కలిపి పనిచేస్తామని బైటెడెన్స్ యాజామన్యంలోని యాప్ ప్రకటించింది.
Also Read :- అమెరికాలో కాల్పులు.. హైదరాబాద్ యువకుడు మృతి
యూఎస్ లో టిక్ టాక్ యాప్ ప్లాట్ ఫాం కొనసాగింపుకు అధ్యక్షుడు ట్రంప్ తో టిక్ టాక్ యాజమాన్యం అయిన బైటెడాన్స్ ఒప్పందం చేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా.. అమెరికాలోని టిక్ టాక్ లో 50 శాతం వాటాను ట్రంప్ కోరారు. సోమవారం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టిక్ టాక్ నిషేధం ఎత్తివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయనున్నారు.
అయితే ఇంతకుముందు పదవీకాలంలో ట్రంప్ ప్రస్తుత వైఖరికి విరుద్ధంగా ఉన్నారు. 2020లో టిక్ టాక్ కంపెనీ అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని చైనా ప్రభుత్వంతో పంచుకుంటుందని నిషేధం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆగస్ట్ 2020లో టిక్‌టాక్‌ను విక్రయించడానికి బైట్‌డాన్స్‌కు 90 రోజుల గడువు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అయితే కొత్త కంపెనీలో ఒరాకిల్ , వాల్‌మార్ట్ లో భాగస్వామ్యం తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారు.