హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందిస్తున్నదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. పర్యావరణానికి, వన్య ప్రాణులకు హాని కలగకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ ఎకో టూరిజం పాలసీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శనివారం ఆమె సెక్రటేరియట్లో ఎకో టూరిజంపై అధికారులతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించామన్నారు. అడ్వెంచర్, రీక్రియేషన్, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్, నేచర్ అండ్ వైల్డ్ లైఫ్, హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తించి వాటిని ఎకో టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం పాలసీ రూపకల్పనలో అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక శాఖలను సమన్వయం చేసుకుంటూ, అడ్డంకులను అధిగమించాలని సూచించారు. ఎకో టూరిజం స్పాట్లను అభివృద్ధి చేసేందుకు పీపీపీ పద్ధతిలో నిధులను సమీకరించాలన్నారు. నదీపరివాహక ప్రాంతాలు, జలపాతాలు వంటి ఏరియాలో స్పాట్లకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. ఆయా పర్యాటక ప్రదేశాల్లో స్థానికులకు, మహిళా సంఘాలకు ఉపాధిని పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని సురేఖ పేర్కొన్నారు.
ఎకో టూరిజాన్ని డెవలప్ చేద్దాం ... అధికారులతో మంత్రి సురేఖ రివ్యూ
- హైదరాబాద్
- June 23, 2024
లేటెస్ట్
- బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!
- బీజేపీ కీలక నేత వినోద్ తావ్డేపై కేసు నమోదు
- 48 గంటల్లో.. 3 కోట్ల రూపాయలు కొట్టేశారు.. బిగ్ స్కాం ఇన్ ఇండియా
- అదుపు తప్పి పొలంలోకి దూసుకెళ్లిన బైక్.. ఇద్దరు యువకులు మృతి
- శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఆదాయం.. 26 రోజుల్లో ఎంత వచ్చిందంటే..?
- మన గురించి రాజకీయ పార్టీల్లో చర్చ ఎందుకు జరగట్లే: MLA వివేక్ వెంకట స్వామి
- కలెక్టర్‌పై దాడి కేసు: సురేష్‌కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
- వరంగల్‌ను హైదరాబాద్ మాదిరిగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఇంకెంత మంది నోళ్లు మూయిస్తరు : మాజీ మంత్రి హరీశ్‌రావు
- హరీశ్ అలెర్ట్ : కాళేశ్వరం కేసులో బిగుస్తున్న ఉచ్చు
Most Read News
- మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.?
- పిల్లాడు నల్లగా పుట్టాడని భార్యపై అనుమానం.. DNA టెస్ట్ చేస్తే చివరికి..
- హైదరాబాద్ కెప్టెన్‌గా తిలక్ వర్మ
- వరంగల్ SBI బ్యాంకులో భారీ దోపిడీ : 10 కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు
- చిరంజీవి, బాలకృష్ణ మధ్య తేడా అదే: డైరెక్టర్ బాబీ కొల్లి
- Pawan Kalyan: పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అలా అన్నాడా..?
- AUS vs IND: పెర్త్ వేదికగా తొలి టెస్ట్.. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఇదే
- ఇవాళ హైదరాబాద్‌లో కరెంట్ ఉండని ప్రాంతాలు
- Kona Venkat: అందుకే నాగార్జున కింగ్ సినిమా ఫ్లాప్ అయ్యింది..
- Starlink Vs BSNL D2D: ఇది వండర్ : ఎలన్ మస్క్ స్టార్ లింక్ కు పోటీగా.. మన BSNL శాటిలైట్స్.. ఆల్ రెడీ వచ్చేసింది.. ఏది బెటరంటే..?