పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ సీట్లు వచ్చినట్లైతే దేశాన్ని మోదీ హిందుదేశంగా మారుస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి ఒక్క ఓటు బీజేపీకి పడేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో రాజాసింగ్ పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు ఒప్పందంతో పనిచేస్తున్నాయని.. అందుకే ప్రచారంలో బీఆర్ఎస్ కనిపించడం లేదని విమర్శించారు. జూటా మాటల్లో మాజీ సీఎం కేసీఆర్ ను రేవంత్ రెడ్డి మించిపోతున్నారన్నారు. ఇవి స్థానిక ఓట్లు కావని ప్రధానమంత్రిని ఎన్నికునే ఓట్లు కాబట్టి మనందరం మోదీనే మళ్ళీ ప్రధానిని చేయాలని చెప్పారు.