విధుల్ని సమర్థవంతంగా నిర్వహిద్దాం : సుదర్శన్ రెడ్డి

విధుల్ని సమర్థవంతంగా నిర్వహిద్దాం :  సుదర్శన్ రెడ్డి

హైదరాబాద్,వెలుగు :  ఎంతోమంది అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్రం సిద్ధించిందని వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి కొనియాడారు.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఖైరతాబాద్ లోని బోర్డు హెడ్డాఫీసులో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎండీ  జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ  విధుల్ని సమర్థంగా నిర్వర్తిస్తూ.. ప్రజలకు మరింత మంచి సేవలు అందించేందుకు పునరంకితం కావాలని  పిలుపునిచ్చారు.  డ్యూటీ చేయడమంటే.. దేశానికి సేవ చేయడమే అని పేర్కొన్నారు.  రెవెన్యూ డైరెక్టర్ వీఎల్. ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ –-2 స్వామి, ప్రాజెక్ట్ డైరెక్టర్ రఘు, సీజీఎంలు, జీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.