నిజామాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి కాంగ్రెస్‌ను గెలిపిద్దామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం అర్బన్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల కృషివల్లే కాంగ్రెస్అధికారంలోకి వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో పనిచేసి పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు విజయం చేకూర్చాలన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి తగిన పదవులను ఇస్తామన్నారు.
అర్బన్ సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా మాజీ మేయర్ సంజయ్ ధర్మపురి అలక వహించి సభ మధ్యలో నుంచి వెళ్లిపోయారు. తనకు మాట్లాడే చాన్స్ ఇవ్వకపోవడంతో పాటు మీటింగ్‌కు ఆలస్యంగా వచ్చిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుకు తన చైర్ ఇవ్వమని కోరడాన్ని అవమానంగా భావించారు. సంజయ్ ఆయన వెంట వచ్చిన అనుచరులు సభ నుంచి వెళ్లిపోయారు. మహేశ్ గౌడ్, ఆకుల లలిత, మానాల మోహన్‌రెడ్డి, నరాల రత్నాకర్, తాహెర్ , సీపీఐ నాయకులు సుధాకర్, ఓమయ్య, ఇమ్రాన్‌అలీ, రాధా కుమార్, భానుచందర్ ఉన్నారు.