ప్రకృతి పంచభూతాలతో ఏర్పడినది. పంచభూతాలైన భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్నిని దేవుళ్లుగా కొలవటం, రాగి, వేప, తులసి, ఆవు మొదలగు ప్రకృతిలోని జీవరాశులను ఆరాధించే సంపద్రాయం హిందూ సమాజంలో ఉన్నది. ప్రకృతిని ఆరాధించే సంప్రదాయమే హిందూ ధర్మం అని చెప్పాలి. గత కొద్ది కాలంగా సంప్రదాయానికి విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగేవీ జరుగుతున్నాయి. ఉత్సవాలు శబ్ద, వాయు, జల ఇతర రకాలైన కాలుష్యాలు చేస్తూ, మనకు తెలియకుండానే మన సంప్రదాయాల్లో అనివార్యమవుతున్నాయి. ఈ అలవాటు పట్టణాల్లో మొదలై పచ్చని పల్లెలకూ వ్యాపించింది. గ్రామాలనూ కాలుష్య స్థావరాలుగా మారుస్తున్న తీరు కనిపిస్తున్నది.
ఉదాహరణకు వినాయక చవితి పండుగ ఒకప్పుడు సాంప్రదాయంగా జరుపుకొనేది. ఇపుడు ఆకర్షణీయ రంగులతో వినాయకుడి ప్రతిమలను పెద్ద ఎత్తున రూపొందిస్తూ వేడుకలు చేసుకుంటున్నాం. సంప్రదాయం ప్రకారం వినాయకుడి ప్రతిమను ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే మట్టితో తయారు చేసి,పూలు, పత్రిలతో భక్తిశ్రద్ధలతో పూజించేది. ఆ తరువాత వినాయకుడి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేసేవాళ్లం. అంటే ప్రకృతి నుంచి సేకరించిన మట్టితో తయారు చేసిన గణపతిని ఎలాంటి కృత్రిమ మార్పులు లేకుండాతిరిగి ప్రకృతిలో కలపటం జరిగేది.
చాలాకాలంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి విగ్రహాలు కాకుండా మట్టి గణపతి విగ్రహాలు వాడాలని పర్యావరణ వేత్తలు చెపుతూనే వస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వాడకం ఏ మేరకైనా తగ్గిందా అంటే అనుమానమే. కాకపోతే ప్రజల్లో మట్టి గణపతులను వాడాలనే ఆకాంక్ష మాత్రం చాలామేరకు పెరిగింది. కానీ వాటి వాడకం మరెంతో పెరగాల్సిన అవసరం ఇప్పటికీ మిగిలే ఉంది. కృత్రిమ రసాయన పదార్థంతో తయారుచేసిన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతి విగ్రహాలను ఆకర్షణీయంగా తయారు చేసి, వీటిని పూజించి నీటిలో నిమజ్జనం చేయడం మాత్రం ఇంకా ఆగిపోలేదు. ఇది తీవ్రమైన జల కాలుష్యా నికి దారి తీస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహా లను నీటిలో నిమజ్జనం చేసినప్పు డు, మంచి నీరు (మృదు జలము) ఉప్పు నీరు (కఠిన జలము) గా మారుతుంది. ఈ విధంగా ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన మంచి నీటివ్యవస్థను సమాజం కోల్పో వలసివస్తుంది.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనిక ఫార్ము లా క్యా ల్షియం సల్ఫే ట్ హెమి హైడ్రేటే. విగ్రహాల తయారీలో వాడుతున్న రసాయనాలు, రంగుల వలన నిమజ్జనం చేసిన చెరువు లేదా జలవనరు నీటిరంగు మారుతుంది. ఆ నీరు పంట పొలాల్లో సేద్యపు నీటిగా వాడడం వలన ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రంగు పదార్థాలు పంట పొలాల్లో అవశేషాలుగా ఉండిపోయి సారవంతమైన పంట భూమిని నిర్జీవంగా మారుస్తుంది. నీటిలో పెరిగే అపారమైన వృక్ష సంపద, మత్స్య సంపద, జంతు సంపద నశిస్తుంది. నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది. కాలుష్య జలంలోని రసాయన పదార్థాలు ఆహారపు గొలుసు ద్వారా మొక్కలు, చేపలు, పక్షులు మొదలైన వాటిలోనికి ప్రవేశించి చివరికి వాటిని తినడం ద్వారా మానవుని శరీరంలోనికి ప్రవేశిస్తాయి.
ఉదాహరణకు 1956వ సంవత్సరం జపాన్ లో ప్రబలిన 'మినామాట' అనేవ్యా ధి. మినామాట అనేపట్టణంలో మిథైల్ మెర్క్యూ రీ అనే రసాయనాన్ని కలిగి ఉన్న పారిశ్రామిక వ్యర్ధజలాలను సముద్రంలోనికి విడుదల చేయడం వలన అనేకమంది ప్రజలు, పిల్లలతో సహా 'మినామాట' అనే అంతుచిక్కని వ్యా ధి బారిన పడి ప్రాణాలు కోల్పో యినారు. విగ్రహాల తయారీలో వాడే ఇనుము, పీచు వంటి వ్యర్థపదార్థాలు నీటిలో అవశేషాలుగా మిగిలిపోతాయి. వ్యర్థపదార్థాలు నీటిలో కుళ్లి కృషించి పోవడం వల్ల వాయు కాలుష్యం ఏర్పడుతున్నది.
పరిశోధనలూ చెబుతున్నాయి
కేంద్ర కాలుష్య నియంతణ్ర మండలి బెంగళూరులో నిర్వహించిన పరిశోధనల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహా లను నిమజ్జనం చేసిన తర్వా త నీటియొక్క ఆమ్లత్వం పెరిగినట్లుగా కనుగొనబడింది. అదేవిధంగా నీటిలో ఇనుము పరిమాణం పది రెట్లు, కాపర్ పరిమాణం 200 నుంచి 300 రెట్లు పెరిగినట్టుగా కనుగొనబడినది. ఇలాంటి ఫలితాలే హైదరాబాద్, నాగపూర్, జబల్పూర్లలో జరిగిన పరిశోధనలలో వెలువడినాయి. విగ్రహాల సుందరీకరణ కోసం వాడే రంగులు, వార్నిషులు పర్యావరణానికి హానికరం. ఐఐటీ -ముంబయి వారు నిర్వహించిన పరీక్షల్లో మట్టితో తయారుచేసిన
వినాయకుని ప్రతిమ 45 నిమిషాల్లో నీటిలో కరిగినట్లయితే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు మాత్రం నీటిలో కరగకుండా కొన్ని నెలలపాటు ఉండిపోతాయని తేలింది. మట్టిగణపతి నీటిలో పూర్తిగా కరిగిపోతుంది కాబట్టి అదేమట్టిని ఉపయోగించి మరుసటి సంవత్సరం కొత్త వినాయకులను తయారు చేసుకోవచ్చు. అంటే రీసైకిల్ చేయవచ్చు. మట్టి వినాయకుడిని పూజించడం ద్వా రా రీసైక్లింగ్ అనే ప్రకృతి విధానాన్ని మనం పాటిస్తున్నాం అన్నమాట. నిమజ్జనం చేసిన ప్లాస్టర్ పారిస్ విగ్రహాలను రీసైకిల్ చేయలేము.
మట్టి మన ప్రాణం
మట్టి జీవాన్ని ఇస్తుంది. మట్టిలో అనేక జీవాలు ఉంటాయి. ఉదాహరణకు మట్టిలో విత్తనం నాటితే అది మహావృక్షంగా మారుతుంది. మట్టి జీవం పోస్తుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్లో విత్తనం నాటితే ఆ విత్తనం చనిపోతుంది. మొలకెత్తదు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ నిర్జీవంగా మార్చే ఒక విష పదార్థం. కాబట్టి మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాన్ని పూజిస్తే జీవం గల దేవుడి ప్రతిమను పూజించినట్లే. మనిషి జీవితం డబ్బు, ఆర్భాటాలతో ముడిపడి లేదు. మనిషి జీవితం గాలి, నీటి తోనే ముడిపడి ఉన్నది. కాబట్టి భగవంతుడు మనకు వరంగా ప్రసాదించిన గాలిని, నీటిని, మట్టిని కాపాడుకుందాం.
గ్రేటర్లో..
గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొ రేషన్ అధికారుల లెక్కల పక్రారం 2022 సంవత్సరంలో సుమారు 89,505 విగ్రహాల నిమజ్జనం జరిగింది. అలాగే నవరాత్రి ఉత్సవాలు జరిగిన పది రోజుల్లో 80, 202 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలు పోగు అయ్యాయి. సంప్రదాయానికి అనుగుణంగా, పర్యావరణ అనుకూలంగా వినాయక చవితి పండుగ జరుపుకొనే విధానం మట్టిగణపతిని పూజించడం. పర్యావరణ అనుకూల సహజ సిద్ధమైన రంగులు వాడటం. ప్లాస్టిక్, ధర్మకోల్ వంటి హానికర పదార్థాలను వాడకపోవడం. కృత్రిమంగా తయారు చేసిన చెరువుల్లో నిమజ్జనం చేయడం. ధ్వని కాలుష్యాన్ని నివారించడం మట్టి గణపతి విగ్రహాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం వల్ల ప్లాస్టర్ పారిస్ విగ్రహాల వాడకం తగ్గుతుంది. పర్యావరణం బాగుంటుంది.
- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ
ఎన్విరాన్మెంటల్ సైన్సెస్