రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా తగ్గలేదు. మొన్నటి వర్షాల నుంచి కూడా జనం ఇంకా తేరుకోలేదు. హైదరాబాద్లో వరద బాధితులకు సాయం సరిగ్గా అందలేదు. వారికి సాయం అందించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మీసేవ దగ్గర తోపులాటలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. కానీ, కరోనా బాధితులు, ముంపు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇప్పుడు ఇంత ఆదరాబాదరాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు షెడ్యూల్ విడుదల, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో ఎంతో ఆలస్యం అవుతోంది.
అదే ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి అన్నీ పక్కాగా జరిగిపోతున్నాయి. ఇది ఎలా సాధ్యపడుతోంది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోటీ పరీక్షల నిర్వహణ కూడా అంతే పక్కాగా ఉండాలి. అప్పుడే ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రజలకు అర్థమవుతుంది. కరోనా టైమ్లో ప్రజలకు ఆదాయం సమకూరేలా చేయాలని ప్రభుత్వం అనుకోవాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని ఎన్నికల పేరుతో వృధా చేస్తోంది. గ్రామ పంచాయతీలు మున్సిపాల్టీలుగా మారి ఏండ్లు గడుస్తున్నాయి. వాటి ఎలక్షన్ల ఊసే ఎత్తడం లేదు. వాటికి సర్పంచులు లేరు ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. పాలకులు వాళ్ల అధికారం గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచిస్తే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా సరైన ఫలితాలే వస్తాయి. -భరత్ రెడ్డి పన్నాల, వికారాబాద్
for more News…
వంద మిలియన్ల ఫాలోవర్లను సాధించిన మొట్టి మొదటి టిక్ టాక్ స్టార్
ప్రాజెక్టు ఏదైనా.. పేదల భూముల్లే లాక్కుంటున్నారు
పబ్జీ బంపర్ ఆఫర్: టోర్నీ గెలిస్తే కోట్లు, గేమ్ ను డిజైన్ చేస్తే లక్షల్లో జీతాలు