గంగాధర, వెలుగు : చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ తీరుకు నిరసనగా గంగాధర మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సామంతుల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ప్రకటించారు. ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వవద్దని కోరుతూ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్వినోద్ కుమార్ కు ఆయనలేఖ రాశారు. ఎమ్మెల్యే వ్యవహార శైలితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతున్నదని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నా తనను పట్టించుకోకుండా అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే పార్లమెంట్, నియోజకవర్గంలో పార్టీ గెలవడం కష్టమని తన లేఖలో ప్రభాకర్ ప్రస్తావించారు. తక్షణం నియోజకవర్గంలో పరిస్థితులు చక్కదిద్దాలని వినోద్‌కుమార్‌ను ఆయన కోరారు.