న్యూఢిల్లీ: క్రిప్టో అసెట్లను రెగ్యులేట్ చేయడానికి గ్లోబల్‌గా ఓ మెకానిజంను తీసుకురావడం కష్టంతో కూడుకున్నదని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. క్రిప్టోలను మానిటర్ చేయడం, వీటిని వివిధ అసెట్ల కింద విడదీయడంలో గ్లోబల్ కోఆర్డినేషన్‌లో అడ్డంకులుగా ఉన్నాయని తెలిపింది. వివిధ జ్యూరిసిడిక్షన్లలలో (దేశాల్లో) రూల్స్ ఒక్కోలా ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొంది.
అందుకే రెగ్యులేటర్లు, ఇండస్ట్రీ వర్గాలు భాగస్వామ్యం అయ్యేందుకు, క్రిప్టోలను రెగ్యులేట్ చేయడానికి ఇతర విధానాలను వెతకాలని వివరించింది. ఈ సందర్భంగా ఇండియా తీసుకున్న చర్యలను ఫాలో కావాలని సలహా ఇచ్చింది. క్రిప్టోలకు సంబంధించి విదేశాలతో కోఆర్డినేట్ అయ్యేందుకు ఆర్‌బీఐ కిందటేడాది అక్టోబర్‌లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ఇతర దేశాలతో జరిపే ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌లు, సర్వీస్‌లను టెస్ట్ చేయడానికి వీలుంటుంది. అంతేకాకుండా డేటా ప్రొటక్షన్‌పై ఇండియాలోని చర్యలను ఫాలో కావాలని సలహా ఇచ్చింది. క్రిప్టో ఎకోసిస్టమ్‌లో వస్తున్న మార్పులు, మార్కెట్‌లోని వోలటాలిటీని చూస్తుంటే దేశాలు ముందుకొచ్చి సమర్ధవంతమైన గైడ్‌లైన్స్‌ను ప్రకటించాల్సిన అవసరం ఉందనే విషయం తెలుస్తోంది’ అని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ అండ్ మానిటరీ సిస్టమ్స్ హెడ్ మాథ్యూ బ్లేక్ అన్నారు.
గత కొన్నేళ్లుగా వివిధ ఇంటర్నేషనల్ సంస్థలు హైలెవెల్ ఫ్రేమ్ వర్క్‌ను తేవడానికి ప్రయత్నించాయని వివరించారు. ఈ సెక్టార్‌ను రెగ్యులేట్ చేయడానికి భిన్నమైన రెగ్యులేటరీ టూల్స్‌ను, లెజిస్లేటివ్ విధానాలను, ఎడ్యుకేషనల్ ఇనీషియేటివ్స్‌ను వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్రిప్టోల్లో ట్రాన్స్‌పరెన్సీ తక్కువగా ఉండడంతో మరిన్నీ రెగ్యులేటరీ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.