
బిజీ షెడ్యూల్‌లో బట్టలు ఉతకడం చాలా శ్రమతో కూడుకున్న పని. సమయం కేటాయించలేం. అటువంటి పరిస్థితుల్లో వాషింగ్ మెషీన్ వాడుతుంటాం.. బిజీగా ఉన్న కుటుంబంలో ఉన్నా, పూర్తి సమయం ఉద్యోగంలో ఉన్నా, లేదా కొంతమంది సౌకర్యం కోరుకునేవారికి వాషింగ్ మెషీన్ సమయాన్ని ఆదా చేస్తుందని చెప్పొచ్చు. డిటర్జెంట్, నీరు ఏర్పాటు చేసి ఆన్ చేస్తే చాలు వాషింగ్ మెషీన్ బట్టలను శుభ్రపరుస్తుంది. దీంతో చేతి వాషింగ్‌తో పోలిస్తే సమయం,శ్రమ ఆదా అవుతుంది. అందుకే చాలా మంది వాషింగ్ ను కొనుగోలు చేస్తుంటారు. వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటే మధ్యతరగతి ప్రజలకు కొంచెం బడ్జెట్ తో కూడుకున్న పని.. మరి లాంటి వారికోసం తక్కువ ధరలో మంచి ఫీచర్లతో అందుబాటులో ఉన్న వాషింగ్ మెషీన్ల ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
LG 7 Kg 5 Star టాప్ లోడెడ్ వాషింగ్ మెషీన్
ఎల్ జీ 7కిలోల ఫుల్లీ ఆటోమేటెక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్.. తక్కువ కరెంట్ తో నడుస్తుంది. ఈ వాషింగ్ మెషీన్ లో 3వాష్ ప్రోగ్రామ్లతో మంచి పనితీరును కనబరుస్తుంది.
చిన్న కుటుంబానికి మంచి ఎంపిక. 5స్టార్ ఎనర్జీ రేటింగ్ తో తక్కువ విద్యుత్ తో పనిచేస్తుంది. ఇందులో ర్యాట్ అవే ఫీచర్ ఉంటుంది. నీటి వినియోగం చాలా తక్కువ. బట్టలు ఉతకడంతోపాటు ఎండబెట్టడి కూడా చేస్తుంది.
ఈవాషింగ మెషీన్ పై 2 సంవత్సరాల వారంటి ఉంటుంది.. మోటార్ పై 5 సంవత్సరాల గ్యారంటీ ఉంటుంది. ఇది1300RPM తో అధిక స్పిన్ వేగంతో బట్టలను త్వరగా ఎండబెడుతుంది. ఈ వాషింగ్ మెషీన్ లో 3 వాష్ ప్రోగ్రామ్ లు ఉన్నాయి. కొన్ని స్వెట్టర్లు, అథ్లెటిక్ బట్టలు, లోదుస్తులు, కుట్టిన వస్తువులు, మందంగా పెళుసుగా ఉండే వస్తువులను కూడా ఇందులో ఉతకొచ్చు.టవల్స్, జీన్స్ వంటి మందపాటి ధృడమైన బట్టలకోసం పటిష్టమైన డ్రమ్ ఉంటుంది.
డిస్ ప్లేలో వాటర్ సెలెక్టర్, వాష్ టైమర్, డ్రెయిన్ సెలెక్టర్, స్పిన్ టైమర్ వంటి ఆప్షన్లు ఉంటాయి. ఈ వాషింగ్ మెషీన్ లో ర్యాట్ అవే ఫీచర్ ఉంటుంది.. ఇది ఎలుకలనుంచి రక్షిస్తుంది. ఎలుకలను రానివ్వకుండా ఒకరకమైన కెమికల్ తో తయారు చేసిన 3mm మందపాటి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఇక ఇందులో ఉండే విండ్ జెట్ డ్రై లాండ్రీలో తేమను తగ్గిస్తుంది.
లింట్ కలెక్టర్: బట్టలు ఉతికేటప్పుడు బయటకు వచ్చే చెత్తని సేకరిస్తుంది. చెత్త ఫాబ్రిక్ పైపులో చిక్కుకోకుండా తద్వారా మెరుగైన వాషింగ్ పనితీరును అందిస్తుంది.దీంతో పాటు కాలర్ స్క్రబ్బర్ - కఫ్స్ కాలర్లను స్క్రబ్ చేయడంలో మీకు సహాయపడుతుంది. యాంటీ వైబ్రేషన్ రబ్బర్, రస్ట్ ఫ్రీ ప్లాస్టిక్ బేస్, స్పిన్ విండో, వాష్ విండో, 05 నిమిషాల స్పిన్ టైమర్, 15 నిమిషాల వాష్ టైమర్ ఉంటుంది.
LG 7 Kg 5 Star Wind Jet Dry Semi-Automatic Top Loading Washing Machine మోడల్ P7020NGAZ . కలర్ Dark Gray. దీని అసలు ధర రూ.16వేలు కాగా.. ఆఫర్ ధరరూ. 11వేల 490 లు.