ఇస్లామాబాద్: పాకిస్తాన్ గూఢచార్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు డైరెక్టర్ జనరల్ (డీజీ)గా లెఫ్ట్ నెంట్ జనరల్(ఎల్జీ) మహమ్మద్ అసిమ్ మాలిక్ నియమితులయ్యారు. ప్రస్తుత ఐఎస్ఐ డీజీ నదీమ్ అంజుమ్ స్థానంలో సెప్టెంబర్ 30న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎల్జీ అసిమ్ మాలిక్ ఫోర్ట్ లీవెన్ వర్త్, రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గతంలో బలూచిస్తాన్‌లోని ఇన్ ఫాంట్రీ డివిజన్, వజీరిస్తాన్‌లోని ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్‌కు నాయకత్వం వహించారు.
ఆయన తన కోర్సులో స్వార్డ్ ఆఫ్ హానర్ ను కూడా అందుకున్నారు. నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ (ఎన్ డీయూ)లో చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. క్వెట్టాలోని కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో కూడా ఇన్ స్ట్రక్టర్ గా సేవలు అందించారు. పాక్ మిలిటరీలో గత కొన్నేండ్లుగా వివిధ హోదాల్లో పని చేశారు.