న్యూఢిల్లీ: దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ కోసం క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డాక్యుమెంట్లను అందజేసింది. ఈ ఐపీఓలో తాజా షేర్ల ఇష్యూ ఉండదు. ప్రమోటర్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ఓఎఫ్ఎస్ ద్వారా 10.18 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్ముతుంది.
ఆఫర్ తర్వాత, దాని వాటా 15 శాతం తగ్గి 57.69 కోట్ల షేర్లకు చేరుకుంటుంది.పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ కాబట్టి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియాకు ఐపీఓ నుంచి ఆదాయం రాదు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్ల వంటి గృహోపకరణాలు అమ్ముతుంది.