
న్యూఢిల్లీ: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఐపీఓకు సెబీ గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సౌత్‌కొరియా కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.15 వేల కోట్ల వరకు సేకరించనుంది. గత ఏడాది డిసెంబరులో ఐపీఓ కోసం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ప్రిలిమినరీ పేపర్లను సెబీకి అందజేసింది. ఐపీఓ ద్వారా 15 శాతం వాటాను అమ్మకానికి పెడతామని తెలియజేసింది.
ఇది పూర్తి ఆఫర్ఫర్సేల్ఇష్యూ కాబట్టి కంపెనీకి ఆదాయం రాదు. డబ్బంతా దక్షిణ కొరియాలోని పేరెంట్కంపెనీకే వెళ్తుంది. ఐపీఓ కోసం ఎల్జీ గత నెల చాలా చోట్ల రోడ్‌షోలను నిర్వహించింది. ఈ కంపెనీకి మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇండియా కార్యకలాపాల ద్వారా రూ. 64,087.97 కోట్ల ఆదాయం వచ్చింది.