
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ‘ఎల్‌జీ’ తప్పుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇతర కంపెనీలతో పోటీని తట్టుకోలేక ఎల్‌జీ ఈ మార్కెట్‌నుంచి తప్పుకుంటోంది. అయితే ఇప్పటికే ఎల్‌జీ ఫోన్స్ వాడుతున్న కస్టమర్స్‌కు సంబంధించిన సర్వీసెస్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సంగతేంటి? ఈ విషయంలో ఎల్‌జీ ఒక క్లారిటీ ఇచ్చింది. మూడేళ్ల వరకు తమ స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్స్ అందిస్తామని చెప్పింది. ఎల్‌జీ ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్స్‌పై మూడేళ్లవరకు, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌పై రెండేళ్లవరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ అందిస్తామని అనౌన్స్ చేసింది. ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ కూడా మరికొంతకాలం అందిస్తామని చెప్పింది. ఎల్‌జీ కొత్త ఫోన్ల ఉత్పత్తి వచ్చే నెల చివరి వరకు కొనసాగుతుంది. జూలై 31 తర్వాత స్మార్ట్‌ఫోన్ బిజినెస్ నుంచి ఎల్‌జీ పూర్తిగా దూరమవుతుంది.