హైదరాబాద్, వెలుగు: ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 65-అంగుళాల క్యూఎన్ఈడీ ఏఐ టీవీని హైదరాబాద్లోని లులు కనెక్ట్ మాల్లో లాంచ్చేసింది. అత్యాధునిక క్యూఎన్ఈడీ టెక్నాలజీ, కట్-ఎడ్జ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాల వల్ల ఇందులో చిత్రాలు చాలా బాగా కనిపిస్తాయని కంపెనీ తెలిపింది.
క్వాంటమ్ డాట్, నానోసెల్ డిస్ప్లే, లోకల్ డిమ్మింగ్ టెక్నాలజీ , 9.1.2 వర్చువల్ సౌండ్ డోల్బీ విజన్, డోల్బీ ఎట్మోస్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఇది వెబ్ఓఎస్తో పనిచేస్తుంది. ఐదేళ్లపాటు ఓఎస్అప్డేట్స్ ఇస్తామని ఎల్జీ తెలిపింది.