ఎల్‌‌‌‌జీ ఓఎల్‌‌‌‌ఈడీ టీవీల్లో కొత్త వెర్షన్లు

ఎల్‌‌‌‌జీ ఓఎల్‌‌‌‌ఈడీ టీవీల్లో కొత్త వెర్షన్లు

క్రాంప్టన్‌‌‌‌ వాటర్‌‌‌‌‌‌‌‌ పంప్ లాంచ్‌‌‌‌

క్రాంప్టన్‌‌‌‌ గ్రీవ్స్‌‌‌‌  తాజాగా మినీ మాస్టర్ ప్లస్ పంప్‌‌‌‌ను లాంచ్‌‌‌‌  చేసింది. ఇందులో హైఫ్లో టెక్నాలజీని వాడామని వెల్లడించింది. వాటర్‌‌‌‌‌‌‌‌ను పంప్ చేయడం మరింత సమర్ధవంతంగా మారుతుందని, వాటర్ ట్యాంక్‌‌‌‌లు సగం టైమ్‌‌‌‌లోనే నిండుతాయని తెలిపింది.  ఈ పంప్‌‌‌‌లో పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ మోటార్‌‌‌‌‌‌‌‌ను వాడామని క్రాంప్టన్‌‌‌‌ పేర్కొంది.

ఎల్‌‌‌‌జీ ఓఎల్‌‌‌‌ఈడీ టీవీల్లో కొత్త వెర్షన్లు

ఓఎల్‌‌‌‌ఈడీ టీవీల్లో కొత్త వెర్షన్లను ఎల్‌‌‌‌జీ లాంచ్ చేసింది. అంతేకాకుండా 246 సెంటీమీటర్ల (97 ఇంచుల) తో  అతిపెద్ద ఓఎల్‌‌‌‌ఈడీ టీవీని  తీసుకొచ్చింది.  8కే ఓఎల్‌‌‌‌ఈడీ జెడ్‌‌‌‌3 సిరీస్‌‌‌‌, ఓఎల్‌‌‌‌ఈడీ ఎవో గ్యాలరీ ఎడిషన్ జీ3 సిరీస్‌‌‌‌, సీ3 సిరీస్‌‌‌‌, ఓఎల్‌‌‌‌ఈడీ బీ3, ఏ3 సిరీస్ టీవీలను కంపెనీ లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.75 లక్షల వరకు ఉన్నాయి.

హెచ్‌‌‌‌పీ  కొత్త ప్రింటర్లు లాంచ్‌‌‌‌

హెచ్‌‌‌‌పీ కొత్త ప్రింటర్లను మార్కెట్‌‌‌‌లోకి తెచ్చింది.  అంతేకాకుండా లేజర్ 1008 సింగిల్ ఫంక్షన్‌‌‌‌, 1188  మల్టీ ఫంక్షనల్ ప్రింటర్లను   అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేసింది. వీటిలో వైఫై కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. నిమిషానికి 20 వరకు పేజీలను ప్రింట్ చేయగలవు. హెచ్‌‌‌‌పీ లేజర్ 1008 రేంజ్ ప్రింటర్ల ధర రూ.14,205 నుంచి,  ఎంఎఫ్‌‌‌‌పీ 1188 రేంజ్‌‌‌‌  రూ.20,344 నుంచి, ఎంఎఫ్‌‌‌‌పీ 1188ఎఫ్‌‌‌‌ఎన్‌‌‌‌డబ్ల్యూ  రేంజ్ రూ.26,581 నుంచి మొదలవుతున్నాయి.

ఈ-స్ప్రింటో నుంచి కొత్త బండి

అమెరీ మోడల్‌‌‌‌ను ఈవీ టూవీలర్  కంపెనీ ఈ–స్పింటో లాంచ్ చేసింది. ఈ బండి ఫుల్ ఛార్జ్‌‌‌‌పై 140 కి.మీ వరకు వెళ్లగలదు.  రిమోట్ కంట్రోల్ లాక్‌‌‌‌, యాంటి థెఫ్ట్‌‌‌‌ అలారం, మొబైల్ ఛార్జింగ్ సాకెట్‌‌‌‌, ఫైండ్ మై వెహికల్‌‌‌‌ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.  గరిష్ట స్పీడ్ గంటకు 65 కి.మీ. ధర రూ.1,29,999 (ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌).

ఇండియాలోకి మెర్సిడెజ్‌‌‌‌ కొత్త బండ్లు

ఏ–క్లాస్ లిమోజిన్‌‌‌‌, ఫియరీ మెర్సిడెజ్‌‌‌‌ ఏఎంజీ  ఏ 45 ఎస్‌‌‌‌ 4మాటిక్‌‌‌‌+ మోడల్స్‌‌‌‌ను  మెర్సిడెజ్‌‌‌‌ బెంజ్ ఇండియాలో లాంచ్ చేసింది. 200 లిమోజిన్‌‌‌‌ ఫేస్‌‌‌‌ లిఫ్ట్ ధర రూ. 45.80 లక్షలు.  ఏఎంజీ ఏ 45 ఎస్‌‌‌‌ 4మాటిక్+ ధర రూ.92.50 లక్షలు (ఎక్స్‌‌‌‌షోరూమ్‌‌‌‌).   ఇంజిన్‌‌‌‌కు ఎనిమిదేళ్ల వారెంటీ ఇస్తున్నారు.