
హైదరాబాద్, వెలుగు: సౌత్ కొరియన్ కంపెనీ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తన మొబైల్ ఫోన్ల బిజినెస్‌ను మూసేసింది. నష్టాలు పేరుకుపోతుండడంతో ఈ బిజినెస్‌ను క్లోజ్ చేయాలని నిర్ణయించుకుంది. గత ఆరేళ్లలో ఎల్‌జీ మొబైల్ ఫోన్ బిజినెస్‌కు రూ. 33,010 కోట్లు(4.5 బిలియన్ డాలర్లు) నష్టాలు వచ్చాయని అంచనా. ఈ ఏడాది జులై 31 నాటికి మొబైల్ ఫోన్ బిజినెస్ నుంచి బయటకు వచ్చేయాలని ఎల్‌జీ చూస్తోంది. ఇప్పటికే తయారు చేసిన ఫోన్లను అమ్ముతామని ప్రకటించింది. 2002 లో మొబైల్ ఫోన్ బిజినెస్‌లోకి ఎంటర్ అయిన ఎల్‌జీ, 2013 టైమ్‌లో గ్లోబల్ టాప్ 3 బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది. వైడ్ యాంగిల్ కెమెరా, రెండు డిస్‌ప్లేలు వంటి ఇన్నొవేటివ్ ఫీచర్లను కంపెనీ తీసుకొచ్చింది. కానీ, ఎల్‌జీ లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కస్టమర్లను ఆకర్షించడంలో విఫలమయ్యాయి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్రాబ్లమ్స్‌తో ఎల్‌జీ ఫోన్ల సేల్స్ పడిపోయాయి. ప్రస్తుతం నార్త్ అమెరికా మార్కెట్లలో ఎల్‌జీ ఫోన్లు బాగా సేల్ అవుతున్నాయి. ఇక్కడ కంపెనీకి మంచి మార్కెట్ కూడా ఉంది. మొబైల్ ఫోన్ల బిజినెస్ నుంచి కంపెనీ తప్పుకుంటుండడంతో యాపిల్, శామ్‌సంగ్ కంపెనీలు నార్త్ అమెరికాలో ఎక్కువగా లాభపడే అవకాశం ఉంది.