ఫ్రీజర్ సెక్షన్‌ను ఫ్రిడ్జ్ సెక్షన్‌కు వైఫై ద్వారా మార్చుకోవడానికి వీలుండే రిఫ్రిజిరేటర్‌ను ఎల్‌జీ లాంచ్ చేసింది. ఎల్‌జీ థింక్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా తమ ఫ్రిడ్జ్‌లను కంట్రోల్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది.
ఈ సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ ధర రూ. 1.23 లక్షల నుంచి రూ.1.53 లక్షల మధ్య ఉంది. ఈ ఫీచర్‌తో పనిచేసే మొత్తం 9 మోడల్స్‌ను కంపెనీ తీసుకొచ్చింది. వీటి కెపాసిటీ 650 లీటర్లు.