బిట్​ బ్యాంక్​: గ్రంథాలయోద్యమం

బిట్​ బ్యాంక్​: గ్రంథాలయోద్యమం

    1872లో సికింద్రాబాద్​లో సోమసుందర్​ 

    మొదలియార్​ స్థాపించిన గ్రంథాలయం తెలుగు ప్రాంతాల్లోనే మొదటిది. 
    1872లో శంకర్​మఠ్​లో శంకరానంద, 
    సికింద్రాబాద్​లో సార్వజనీక గ్రంథాలయాలను ముదిగొండ శంకరాచార్యులు స్థాపించారు. 
    అసఫియా లైబ్రరీని 1892లో స్థాపించారు. 
    1895లో శాలిబండలో భారత్​ గుణవర్థక్​ సంస్థ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 
    బొల్లారంలో అల్బర్ట్​ రీడింగ్​ రూంను 1896లో ఏర్పాటు చేశారు.
    గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, పితామహుడు కొమర్రాజు లక్ష్మణరావు. 
    మునగాల సంస్థానాధీశుడు నాయని వెంకటరంగారావు వద్ద కొమర్రాజు లక్ష్మణరావు దివాన్​గా పనిచేశారు. 
    నాయని వెంకటరంగరావు, రావిచెట్టు రంగారావులతో కలసి కొమర్రాజు లక్ష్మణరావు 1901లో హైదరాబాద్​లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 
    హన్మకొండలోని రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయాన్ని 1904లో ఏర్పాటు చేశారు. 
    1905లో సికింద్రాబాద్​లో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 
    1906లో విజ్ఞాన చంద్రికా మండలిని కొమర్రాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు ఏర్పాటు చేశారు. 
    తెలుగు ప్రాంతంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన మొదటి సంస్థ విజ్ఞాన చంద్రికా మండలి.
    లక్ష్మణరావు రచించిన ఆంధ్రుల చరిత్రను విజ్ఞాన చంద్రికా మండలి ప్రచురించింది. 
    1910లో ఖమ్మంలో ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు. 
    1913లో వరంగల్​ జిల్లా మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు. 
    1913లో సికింద్రాబాద్​లో సంస్కృత కళావర్ధిని గ్రంథాలయాన్ని స్థాపించారు.
    1918లో హైదరాబాద్​లో రాజబహదూర్​ వెంకటరామిరెడ్డి చొరవతో రెడ్డి హాస్టల్​ గ్రంథాలయం ఏర్పడింది. 
    1924 నుంచి 1932 వరకు సురవరం ప్రతాపరెడ్డి, రెడ్డి హాస్టల్​ గ్రంథాలయానికి కార్యదర్శిగా పనిచేశారు. 
    వీర సావర్కర్ రచించిన వార్​ ఆఫ్​ ఇండిపెండెంట్స్​ అనే గ్రంథం రెడ్డి హాస్టల్​ గ్రంథాలయంలో ఉండటంతో సురవరం ప్రతాపరెడ్డి తన కార్యదర్శి పదవిని కోల్పోయారు. 
    గ్రంథాలయోద్యమకారుల కోసం సురవరం ప్రతాపరెడ్డి రచించిన గ్రంథం తెలంగాణాంధ్రుల కర్తవ్యం. 
    1918లో నల్లగొండలో ఆంధ్ర సరస్వతి గ్రంథాలయం స్థాపించారు. 
    1918లో నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో ప్రజల సహకారంతో ఆంధ్ర ప్రకాశిని అనే గ్రంథాలయాన్ని పువ్వాడ వెంకటప్పయ్య అనే ఉపాధ్యాయుడు స్థాపించాడు. 
    పువ్వాడ వెంకటప్పయ్య తెలుగు పుస్తకాల ముద్రణకు స్థాపించిన సంస్థ కృషి ప్రచారిణి గ్రంథమాల. 
    1920లో సికింద్రాబాద్​లో మాడూరి రాఘవులు స్థాపించిన గ్రంథాలయం భాషాక్పవల్లి. 
    హైదరాబాద్​లోని అఫ్జల్​గంజ్​లో బాలసరస్వతి గ్రంథాలయాన్ని 1923లో ఏర్పాటు చేశారు. 
    1923లో కొండా వెంకటరంగారెడ్డి తన సొంత ఖర్చులతో వేమన ఆంధ్ర భాషా నిలయం ఏర్పాటు చేశారు. 
    1923లో ఖమ్మంలో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 
    1925లో ఆంధ్ర సోదరీ సమాజ గ్రంథాలయాన్ని హైదరాబాద్​లో ఏర్పాటు చేశారు. 
    1926లో ఆది హిందూ లైబ్రరీని బి.ఎస్​.వెంకట్రావు ఏర్పాటు చేశారు. 
    దక్కన్​ వైశ్య సంఘ గ్రంథాలయాన్ని 1926లో ఏర్పాటు చేశారు. 
    మెదక్​ జిల్లాలోని జోగిపేట గ్రంథాలయాన్ని 1930లో ఎప్పుడు ఏర్పాటు చేశారు.