నిరుద్యోగులతో లైబ్రరీలు ఫుల్

నోటిఫికేషన్ల కోసం నిరీక్షణ

పుస్తకాలతో కుస్తీ

ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు

హైదరాబాద్, వెలుగు: నోటిఫికేషన్లు లేక సిటీ లైబ్రరీల్లో నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సుమారు 2 లక్షలకు పైగా నిరుద్యోగులు నిత్యం వివిధ రకాల సెక్టార్ల పరీక్షల కోసం ప్రిపేరవుతున్నారు. జాబ్స్ కోసం జాగారం చేస్తూ తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. లైబ్రరీలతో పాటు స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులతో నిండిపోతున్నాయి. ప్రతి రోజూ లైబ్రరీలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూనే ఉందని లైబ్రరీ అధికారులు చెబుతున్నారు. టీఎస్‌పీఎస్‌సీ, గ్రూప్–2, స్టేట్ గవర్న్‌మెంట్‌లో వివిధ డిపార్ట్​మెంట్ల పోస్టులతో పాటు సెంట్రల్ గవర్న్​మెంట్ నోటిఫికేషన్లు కూడా రాకపోవడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు అరకొర పోస్టులను ప్రకటిస్తూ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా, చిక్కడపల్లి సెంట్రల్, అఫ్జల్ గంజ్ లైబ్రరీలన్నీ నిరుద్యోగులతో కళకళలాడుతున్నాయి. ఉస్మానియా వర్సిటీలో ప్రతి రోజు సుమారు 5 వేల మంది, సెంట్రల్ లైబ్రరీలో వెయ్యి మంది, అఫ్జల్ గంజ్ లైబ్రరీలో 1500 మంది వరకు ప్రిపేర్ అవుతున్నట్లు లైబ్రరీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు దిల్‌సుఖ్‌నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, ఆశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, తదితర ప్రాంతాల్లో ఉండే కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిళ్లల్లో సైతం ప్రతి రోజూ లక్షలాది మంది నిరుద్యోగులు బుక్స్‌తో కుస్తీ పడుతున్నారు.

సరైన నోటిఫికేషన్లు లేకపోయినా, భవిష్యత్‌లో ప్రకటిస్తారేమోననే ఆశాభావంతోఎదురుచూస్తున్నామని నిరుద్యోగులు చెబుతున్నారు. 2016 తర్వా త రాష్ర్టంలో సరైన నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. టీఎస్‌పీఎస్‌సీ కూడా నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం ఆందోళనకరం. 2018లో కేవలం10 వేల కానిస్టేబుల్ పోస్టులు, మళ్లీ తిరిగి 2019 డిసెం‌బర్ నెలలో కేవలం 34 ఫుడ్ ఆఫీసర్స్ పోస్టులకు ప్రకటన ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీలకు చెందిన సుమారు 30 వేల బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నప్పటికీ వాటికి కూడా 2011 నుంచి నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేయడం లేదని స్టూడెంట్స్ ఆవేదన చెందుతున్నారు. అర్బన్ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా సెంట్రల్, బ్యాంక్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుండగా, రూరల్ ప్రాంతాల వారు గ్రూప్–2, టీఎస్‌పీఎస్‌సీ పరీక్షల కోసం ప్రిపేరవుతున్నారు. మరోవైపు చాలా మంది నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. నిత్యం లైబ్రరీలకే పరిమితమవడం, ఇతర జాబ్‌లు చేయలేని స్థితిలో రూమ్ రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి ఉందని ఓయూ నిరుద్యోగ జేఏసీ విద్యార్థి నరేష్ తెలిపారు.

నాలుగేండ్ల నుంచి ఏం మారలే

నాలుగేళ్ల నుంచి గ్రూప్ – 2 కోసం రెడీ అవుతున్నా. కానీ ప్రభుత్వంనోటిఫికేషన్లు విడుదలచేయకపోవడంబాధాకరం. జాబ్ కోసంజాగారం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.తెలంగాణ రాష్ర్టం వచ్చాక జాబ్స్​పెరుగుతాయనిఆశించాం. కానీ ఏమీ మారలేదు. విద్యార్థులఇబ్బందులు ఎప్పటిలాగానే ఉన్నాయి.

– నాగరాజు, నల్గొండ, ఓయూ లైబ్రరీ

ఊళ్లకు వెళ్లిపోతున్నరు

ఏడాదిన్నర నుంచికాంపిటేటివ్ పరీక్షలకుప్రిపేర్ అవుతున్నా.నోటిఫికేషన్లు కోసంఎదురుచూస్తు న్నం .చాలా మందినోటిఫికేషన్లు ఇగ రావనినిరాశతో ఊర్లకు వెళ్లిపోతున్నారు. నాకు కూడాఆసక్తి తగ్గు తోంది. అవకాశం ఉన్నా సర్కారునోటిఫికేషన్ ఇవ్వడం లేదు.

రాజ్ కుమార్, వరంగల్

రూమ్ రెంట్లూ కట్టలేకపోతున్నం

నాలుగేళ్ల నుంచిగ్రూప్– 2 కోసంప్రిపేరవు తున్నాను.కనీసం నా తలరాతపరీక్షించు కుందామనుకున్ నా నోటిఫికేషన్రావడం లేదు. ఒకవైపునోటిఫికేషన్ లేక, వేరు జాబులు చేయలేకరూమ్ రెంట్లు కూడా కట్టలేని పరిస్థితి ఉంది.

– శ్రీనివాస్

రెండేళ్లుగా గ్రూప్-2 కోసం నిరీక్షిస్తున్నా

2016లో చివరి సారిగా వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటి వరకు మరలఇవ్వలేదు. పోస్టు లు ఖాళీగా ఉన్నాయి. అయినా పోస్టు లను ప్రకటించడం లేదు.నిద్రలు లేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాం . ప్రతి సారి రెండు నెలల్లో నోటిఫికేషన్వస్తుంది అని చెబుతూ సర్కారు కాలం వెళ్లదీస్తోం ది. ఈ సారైనా వస్తుందేమోననే ఆశతో ఉన్నా.

– విజయ్, సెంట్రల్ లైబ్రరీ

ఈ నిరీక్షణ ఎన్నా ళ్లో..

టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందన్ననమ్మకం లేదు. ఈనిరీక్షణ ఎన్నాళ్లో అర్థంకావడం లేదు. బ్యాక్ లాగ్ పోస్టు లు సుమారు30 వేల వరకు ఉన్నా 2011 నుంచి నోటిఫికేషన్విడుదల చేయలేదు. రెండునెలల్లో విడుదలచేయకపోతే రాష్ర్ట వ్యాప్తం గా ఆందోళనలునిర్వహిస్తాం .

– నరేష్ , ఓయూ నిరుద్యోగ జేఏసీ

For More News..

ఆమెను కూడా నిర్భయ దోషులలాగే జైళ్లో పెట్టాలి

రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే.. జగన్ రద్దు చేస్తానంటున్నాడు

మూడు రాజధానుల విషయంలో కేంద్రానికి సంబంధం లేదు