ఫారిన్‌‌‌‌ సబ్సిడరీల చీఫ్‌‌‌‌లతో ఎల్‌‌‌‌ఐసీ కాన్ఫరెన్స్‌‌‌‌

ఫారిన్‌‌‌‌ సబ్సిడరీల చీఫ్‌‌‌‌లతో ఎల్‌‌‌‌ఐసీ కాన్ఫరెన్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: యూకే,  సింగపూర్‌‌‌‌‌‌‌‌,  బహ్రెయిన్‌‌‌‌, కెన్యా, ఫిజీ, మారిషస్‌‌‌‌, నేపాల్‌‌‌‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌‌‌‌లోని  తన  సబ్సిడరీలకు చెందిన సీఈఓలతో  ఎల్‌ఐసీ శుక్రవారం కాన్ఫరెన్స్‌‌‌‌ను నిర్వహించింది. (గుజరాత్‌‌‌‌) లోని  గిఫ్ట్ సిటీలో ఈ సమావేశం జరిగింది. కంపెనీ  గిఫ్ట్‌‌‌‌ సిటీలో ఇన్సూరెన్స్ ఆఫీస్‌‌‌‌ను ఓపెన్ చేయడానికి ఐఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీఏ నుంచి అనుమతులు పొందింది. ఈ ఆఫీస్ నుంచి  గ్లోబల్‌‌‌‌గా ఎల్‌‌‌‌ఐసీ బ్రాండ్‌‌‌‌ను విస్తరిస్తామని  కంపెనీ సీఈఓ సిద్ధార్ధ మహంతి అన్నారు.  గ్లోబల్‌‌‌‌గా ఇండియన్లను చేరుకోవడానికి టెక్నాలజీ వాడుకుంటామని,‌‌‌‌  ఇన్సూరెన్స్‌‌‌‌, ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ఆప్షన్లను వీరికి అందిస్తామన్నారు.

ఎల్‌‌ఐసీ మ్యూచువల్ ఫండ్ నుంచి కొత్త ఫండ్‌‌ ఎల్‌‌ఐసీ మ్యూచువల్ ఫండ్   కొత్త మాన్యుఫాక్చరింగ్ ఫండ్‌‌ను  తీసుకొచ్చింది. ఇదొక  ఓపెన్  ఎండెడ్ ఈక్విటీ స్కీమ్‌‌.  తయారీ రంగంలోని  కంపెనీల షేర్లలో  ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ (ఎన్‌‌ఎఫ్‌‌ఓ) వచ్చే నెల 4 వరకు ఓపెన్‌‌లో ఉంటుంది. అక్టోబర్ 11న   యూనిట్లను కేటాయిస్తారు.  దేశ జీడీపీ గ్రోత్‌‌ పెరుగుతోందని, పట్టణాలు విస్తరిస్తుండడం, మిడిల్ క్లాస్ పెరుగుతుండడం,  పీఎల్‌‌ఐ స్కీమ్, మేకిన్ ఇండియా వంటి ప్రభుత్వ ఇనీషియేటివ్‌‌లతో మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ మరింత పెరుగుతుందని ఎల్‌‌ఐసీ మ్యూచువల్‌‌ ఫండ్ ఎండీ ఆర్‌‌‌‌కే ఝా అన్నారు. ప్రపంచానికి తయారీ హబ్‌‌గా ఎదగాలని ఇండియా చూస్తోందని పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు