ఎల్‌‌‌‌ఐసీ నుంచి కొత్త పాలసీ

ఎల్‌‌‌‌ఐసీ నుంచి కొత్త పాలసీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:   ఇండెక్స్‌‌‌‌ ప్లస్ పేరుతో కొత్త  పాలసీని ఎల్‌‌‌‌ఐసీ లాంచ్ చేసింది. ఇదొక ఇండివిడ్యువల్ లైఫ్‌‌‌‌ ఇన్సూరెన్స్, సేవింగ్స్ ప్లాన్‌‌‌‌. పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 90 రోజులు. గరిష్ట వయసు 60 ఏళ్లు. ఏడాదికి చెల్లించే ప్రీమియంపై కనీసం 7 రెట్లు  వరకు సమ్ అస్యూర్డ్‌‌‌‌ను ఎల్‌‌‌‌ఐసీ ఇండెక్స్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది.

పాలసీ టెర్మ్‌‌‌‌ కనిష్టంగా 10 లేదా 15 ఏళ్లు. గరిష్టంగా 25 ఏళ్లు. ఏడాదికి కనీసం రూ.30 వేలు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది.    ఫ్లెక్సీ గ్రోత్‌‌‌‌ ఫండ్‌‌‌‌, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్స్‌‌‌‌లో ప్రీమియంను ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు. ఐదేళ్ల లాకిన్ పీరియడ్‌‌‌‌ తర్వాత కొంత అమౌంట్‌‌‌‌ను వెనక్కి తీసుకోవచ్చు.