హైదరాబాద్, వెలుగు: ఎన్‌టీఆర్ స్టేడియం (హైదరాబాద్) లో జరుగుతున్న బుక్ ఫెయిర్‌లో ఎల్‌ఐసీ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. దీనిని కంపెనీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. దేశంలోని వివిధ పబ్లిషర్లు ఈ బుక్ ఫెయిర్‌లో పాల్గొన్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఎల్‌ఐసీ ఈ స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
బీమా శక్తి ప్రోగ్రామ్‌ను కూడా ప్రమోట్ చేస్తోంది. ఈ ప్రోగ్రామ్ కింద అర్హత పొందిన మహిళలను ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమించుకుంటారు. మూడేళ్ల పాటు ఫిక్స్డ్ స్టై పెండ్‌ను ఇస్తారు. సీనియర్ అధికారులు ఉతప్ జోసెఫ్, జీ మధుసూదన్, ప్రమోద కుమార్ సాహు, తదితరులు స్టాల్ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు.