ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ నుంచి సేవింగ్స్‌‌‌‌‌‌‌‌, ఇన్సూరెన్స్ ప్లాన్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ)  ‘జీవన్‌‌‌‌‌‌‌‌ కిరణ్‌‌‌‌‌‌‌‌’ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌‌‌‌‌‌‌‌ గురువారం నుంచే అందుబాటులో ఉంది. జీవన్ కిరణ్‌‌‌‌‌‌‌‌ కింద పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లైఫ్ కవర్ అందిస్తుండడంతో పాటు, రిటర్న్‌‌‌‌‌‌‌‌ను కూడా ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఆఫర్ చేస్తోంది. ఇదొక సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌.  18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్యలో ఉన్నవారు ఎవరైనా ఈ పాలసీని తీసుకోవచ్చు. సమ్‌‌‌‌‌‌‌‌ అస్యూర్డ్‌‌‌‌‌‌‌‌ (మెచ్యూరిటీ అయ్యాక ఇచ్చే డబ్బులు)  కనీసం రూ.15 లక్షలు ఉంటుంది. పాలసీ టెర్మ్ 10  ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. సిగరెట్‌‌‌‌‌‌‌‌ కాల్చేవారు, కాల్చని వారు కట్టే ప్రీమియం రేట్లలో తేడా ఉంది. 

ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ జీవన్ కిరణ్ కోసం  ఒకేసారి మొత్తం ప్రీమియం కట్టేయొచ్చు. లేదా రెగ్యులర్ బేసిస్‌‌‌‌‌‌‌‌లో  పాలసీ టెర్మ్‌‌‌‌‌‌‌‌ లో కట్టొచ్చు. రూ.50 లక్షల కంటే ఎక్కువ సమ్‌‌‌‌‌‌‌‌ అస్యూర్డ్‌‌‌‌‌‌‌‌ పొందే పాలసీ హోల్డర్లకు సపరేట్‌‌‌‌‌‌‌‌గా రిబేట్స్‌‌‌‌‌‌‌‌ (రాయితీలు) కూడా ఉంటాయని ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ పేర్కొంది. రెగ్యులర్ ప్రీమియం పాలసీ తీసుకున్న వారు కనీసం రూ.3 వేలు ప్రీమియంగా కట్టాల్సి ఉంటుంది. సింగిల్ ప్రీమియం పాలసీ తీసుకున్నవారు కనీసం రూ.3 లక్షలు కట్టాల్సి ఉంటుంది. 

ALSO READ :వర్షాల కారణంగా బ్రేక్.. అమిత్​షా, ప్రియాంక సభలు వాయిదా

మెచ్యూరిటీ..చనిపోయినప్పుడు

పాలసీ మెచ్యూరిటీ అయితే పాలసీ హోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కట్టిన మొత్తం ప్రీమియంను తిరిగి చెల్లిస్తారు. పాలసీ టైమ్‌‌‌‌‌‌‌‌లో వీరు కట్టిన ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రా ప్రీమియం, ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు ఇందులో కలిసి ఉండవు. అదే పాలసీ టెర్మ్‌‌‌‌‌‌‌‌లోపే పాలసీదారుడు చనిపోతే అస్యూర్డ్‌‌‌‌‌‌‌‌ సమ్‌‌‌‌‌‌‌‌ను  చెల్లిస్తారు. రెగ్యులర్ ప్రీమియం పాలసీ అయితే ఏడాదికి కట్టిన ప్రీమియంకు ఏడు రెట్లు లేదా మొత్తం ప్రీమియం కంటే 105 శాతం ఎక్కువ చెల్లిస్తారు.  

సింగిల్ ప్రీమియం పాలసీలకు అయితే మొత్తం ప్రీమియంపై లేదా బేసిక్ సమ్ అస్యూర్డ్‌‌‌‌‌‌‌‌పై 125 శాతం ఎక్కువ ప్రీమియం చెల్లిస్తారు.  అదనంగా ప్రీమియం చెల్లించడం ద్వారా యాక్సిడెంటల్ డెత్ , డిసెబిలిటీ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను కూడా పొందొచ్చని ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ప్రకటించింది. పాలసీ తీసుకున్న ఐదేళ్లకు సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆప్షన్ ఉందని వెల్లడించింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ జీవన్ కిరణ్‌‌‌‌‌‌‌‌ను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ మార్గాల్లో కొనుక్కోవచ్చు.