
హైదరాబాద్, వెలుగు: పాలసీ హోల్డర్లకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడానికి, అమ్మకాలను మెరుగుపరుచుకోవడానికి ఎల్ఐసీ ‘వన్మ్యాన్ఆఫీస్’ (ఓమో) పేరుతో ఆన్‌లైన్ సర్వీసును మొదలుపెట్టింది. ఈ మొబైల్యాప్ ఎల్ఐసీ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటుంది. వన్ మ్యాన్ ఆఫీస్ ద్వారా ఏజెంట్లు, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, సీనియర్ బిజినెస్ అసోసియేట్‌లు, చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్లు, ఎల్ఐసీ అసోసియేట్‌లు, చీఫ్ ఆర్గనైజర్‌లతో కూడిన సమగ్ర డిజిటల్ ఎకో సిస్టమ్‌ను ఎల్‌ఐటీ డెవలప్ చేసింది.
వారి రోజువారీ కార్యకలాపాలకు సహాయం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి ఇది ఒక ముఖ్యమైన ప్లాట్‌ఫామ్ అని ఎల్ఐసీ సీఈఓ సిద్ధార్థ మొహంతి అన్నారు. '2047 నాటికి అందరికీ బీమా' లక్ష్యాన్ని సాధించడానికి ఓమో ఒక ముందడుగు అవుతుందని కామెంట్చేశారు. పాలసీల అమ్మకం, వివిధ రకాల సేవలు అందించడం, వ్యాపారాన్ని ట్రాక్ చేయడానికి ఓమో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో ప్రీమియం కాలిక్యులేటర్, చిరునామా మార్పు, ఆన్‌లైన్ లోన్ రిక్వెస్ట్, క్లెయిమ్ సబ్మిషన్, రెన్యువల్ ప్రీమియం చెల్లింపుల వంటి ఫీచర్లు ఉంటాయి.