హెల్త్ ఇన్సూరెన్స్ లోకి ఎల్ఐసీ..

హెల్త్ ఇన్సూరెన్స్ లోకి ఎల్ఐసీ..

న్యూఢిల్లీ: ఈనెలాఖరులోపే ఒక హెల్త్​ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా కొంటామని ఎల్​ఐసీ సీఈఓ సిద్ధార్థ మహంతీ మంగళవారం ప్రకటించారు. చర్చలు తుదిదశలో ఉన్నాయని, మరికొన్ని రోజుల్లో ఒప్పందం ఖరారు అవుతుందని వెల్లడించారు. కంపెనీ పేరును మాత్రం బయటపెట్టలేదు. అయితే వాటా 51 శాతాన్ని మించబోదని, కంట్రోల్​స్టేక్​ను తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రస్తుత రూల్స్​ప్రకారం జీవితబీమా కంపెనీలు హెల్త్​కవర్​ అందించకూడదు. 

వీటికి కాంపోజిట్ ​లైసెన్స్​ ఇవ్వాలనే సూచన వచ్చినా, బడ్జెట్​లో మాత్రం ప్రభుత్వం ప్రకటన చేయలేదు. అయితే ఎల్​ఐసీ మణిపాల్ ​సిగ్నాలో రూ.నాలుగు వేల కోట్ల విలువైన వాటాలు కొనబోతున్నట్టు తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో ఎల్​​ఐసీ నికర ప్రీమియం ఆదాయం 9 శాతం తగ్గి రూ.1.06 లక్షల కోట్లకు చేరుకుంది. 

స్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎలోన్ నికర లాభం 17 శాతం పెరిగి రూ.11,056 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఆర్​బీఐ వందేళ్ల గర్నమెంట్​బాండ్లను ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మహంతీ కోరారు. ప్రస్తుతం 40 ఏళ్ల బాండ్లకే అనుమతులు ఉన్నాయని, వీటికి 50 ఏళ్లకు, వందేళ్లకు పెంచాలని కోరామని తెలిపారు.