ఎల్​ఐసీ నుంచి మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌‌‌‌‌‌‌‌

ఎల్​ఐసీ నుంచి మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​, వెలుగు: ఈక్విటీ, డెట్,  బంగారంలో పెట్టుబడి పెట్టే ఓపెన్-ఎండ్ స్కీమ్  మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌‌‌‌‌‌‌‌ను ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ ప్రారంభించింది. కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 24న  ప్రారంభమై వచ్చే నెల ఏడో తేదీన ముగుస్తుంది. ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌లో ఈక్విటీ, డెట్, గోల్డ్ ఈటీఎఫ్​లు, సిల్వర్ ఈటీఎఫ్​లు, రీట్, ఇన్విట్​ల వంటి ఆస్తులు ఉంటాయి. వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలిక మూలధనాన్ని పెంచడం ఫండ్​ లక్ష్యం.