న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) కొన్ని స్కీమ్స్‌లో ఇన్వెస్టర్లు చేస్తున్న డైలీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) మినిమమ్ అమౌంట్‌ను రూ.100 కి తగ్గించింది. అక్కడి నుంచి రూపాయి మల్టిపుల్‌తో సిప్ చేయొచ్చు. అంటే రూ. 101, రూ. 102 ..ఇలా డైలీ సిప్ చేయొచ్చు. కంపెనీకి చెందిన కొన్ని స్కీమ్‌లపై మంత్లీ సిప్ మినిమమ్ అమౌంట్ రూ.200 కి తగ్గింది.
అక్కడి నుంచి రూ.1 మల్టిపుల్‌తో ఇన్వెస్ట్ చేయొచ్చు. మూడు నెలలకొకసారి చేసే క్వార్టర్లీ సిప్ మినిమమ్ అమౌంట్ రూ.1,000 కాగా, అక్కడి నుంచి రూ.1 మల్టిపుల్‌తో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎల్‌ఐసీ ఎంఎఫ్ ఈఎల్‌ఎస్‌ఎస్ ట్యాక్స్ సేవర్, ఎల్‌ఐసీ ఎంఎఫ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ మినహా మిగిలిన అన్ని ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్‌కు డైలీ మినిమమ్ సిప్ రూ.100 రూల్ వర్తిస్తుంది. ఈ నెల 16 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.