న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్‌లో తన వాటాను 4.66 శాతానికి తగ్గించుకుంది. సుమారు మూడు సంవత్సరాల్లో రెండు శాతం వాటాను ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. అక్టోబర్ 8, 2021– సెప్టెంబరు 13, 2024 మధ్య కాలంలో డీసీఎం శ్రీరామ్‌లో తన హోల్డింగ్‌లో 2.016 శాతం నికర తగ్గుదల ఉందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఎల్‌ఐసీ తెలిపింది. షేర్లు సగటు ధర రూ. 110.072 వద్ద అమ్ముడయ్యాయి.
డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లలో తన వాటాను 58,06,760 నుంచి 40,52,635 షేర్లకు తగ్గించింది. డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ ప్రధానంగా చక్కెర, ఆల్కహాల్, పారిశ్రామిక ఫైబర్‌లను తయారు చేస్తుంది. డీసీఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ షేర్లు బీఎస్‌ఈలో 1.77 శాతం తగ్గి రూ.194 వద్ద స్థిరపడ్డాయి.