ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ లాభం రూ. 7 వేల 621 కోట్లు

ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ లాభం రూ. 7 వేల 621 కోట్లు

న్యూఢిల్లీ : ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ నికర లాభం సెప్టెంబర్ 30తో ముగిసిన క్వార్టర్లో 3.8 శాతం క్షీణించి రూ. 7,621 కోట్లకు తగ్గింది.  గత ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.7,925 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో దాని నికర ప్రీమియం ఆదాయం రూ.1,19,901 కోట్ల నుంచి రూ. 1,07,397 కోట్లకు తగ్గింది.  

బీమా సంస్థ  ఇతర ఆదాయం అంతకు ముందు సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.248 కోట్ల నుంచి దాదాపు సగానికి తగ్గి రూ.145 కోట్లకు చేరుకుంది.    తాజా క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.2,29,620 కోట్లకు పెరిగిందని, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.2,01,587 కోట్లుగా ఉందని పేర్కొంది.