న్యూఢిల్లీ: ఏషియన్ పెయింట్స్‌లో తన వాటాను 7 శాతానికి ఎల్‌ఐసీ పెంచుకుంది. ఈ పెయింట్ కంపెనీలో అతిపెద్ద డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (డీఐఐ) గా నిలిచింది. ‘ఏషియన్ పెయింట్స్‌లో ఎల్‌ఐసీ ఈక్విటీ 4.79 కోట్ల షేర్ల నుంచి 6.72 కోట్ల షేర్లకు చేరుకుంది. అంటే పెయిడప్ క్యాపిటల్‌లో ఎల్‌ఐసీ వాటా 5.001 శాతం నుంచి 7.010 శాతానికి పెరిగింది’ అని ఎల్‌ఐసీ పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 1– డిసెంబర్ 9 మధ్య ఏషియన్ పెయింట్స్‌లో 2.009 శాతం వాటాను ఓపెన్ మార్కెట్‌లో ఎల్‌ఐసీ పెంచుకుంది. ఇందుకోసం ఒక్కో షేరుకి రూ.2,891.25 చెల్లించింది. ఏషియన్ పెయింట్స్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.2.30 లక్షల కోట్లు. కంపెనీ నెట్ ప్రాఫిట్ సెప్టెంబర్ క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 42 శాతం తగ్గి రూ.694.64 కోట్లకు పడింది. రెవెన్యూ కూడా 5 శాతం తగ్గి రూ.8 వేల కోట్లుగా రికార్డయ్యింది.