
న్యూఢిల్లీ: తమకు మేలు చేయడానికి కేంద్రం విదేశీ కంపెనీలను చిన్నచూపు చూస్తోందంటూ యూఎస్ట్రేడ్ రిప్రజెంటేటివ్(యూఎస్టీఆర్) చేసిన విమర్శలను ఎల్ఐసీ తిప్పికొట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు పొందామన్న వాదనలను తోసిపుచ్చింది. ఇండియా ఇన్సూరెన్స్ మార్కెట్లో విపరీతమైన పోటీని ఎదుర్కొంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఐఆర్డీఐ, సెబీ రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నామని వివరణ ఇచ్చింది.
తమ పనితీరు గురించి సరిగ్గా తెలుసుకోకుండా యూఎస్టీఆర్ విమర్శలు చేసిందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగానే కస్టమర్లు ప్రైవేటు కంపెనీలకు బదులు ఎల్ఐసీ ఇన్సూరెన్స్‌ను ఎంచుకుంటున్నారని యూఎస్టీఆర్ ఆరోపించింది. దీనికి ఎల్ఐసీ స్పందిస్తూ ప్రభుత్వాలు, రెగ్యులేటర్లు ఇతర కంపెనీల మాదిరే తమతోనూ వ్యవహరిస్తున్నారని స్పష్టం చేసింది.