న్యూఢిల్లీ: మణిపాల్‌సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్‌లో 50 శాతం వాటాను కొనుగోలు చేయాలని ఎల్‌ఐసీ ప్లాన్ చేస్తోంది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం జనరల్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లో ఎల్‌ఐసీ లీడర్‌గా కొనసాగుతోంది. మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, యూఎస్ కంపెనీ సిగ్నా కార్పొరేషన్‌ల జాయింట్ వెంచర్ కంపెనీ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్.
మణిపాల్ గ్రూప్‌కు ఈ జాయింట్ వెంచర్‌లో 51 శాతం వాటా ఉండగా, సిగ్నా కార్పొరేషన్‌కు 49 శాతం ఉంది. ఎల్‌ఐసీకి, మణిపాల్‌సిగ్నాకు మధ్య చర్చలు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. డీల్ విలువ రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కాగా, రూ.3 లక్షల కోట్ల సైజ్ ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ వాటా37 శాతం ఉంది. అంటే సుమారు రూ.1.10 లక్షల కోట్లు.