- క్లెయిమ్స్ దరఖాస్తులకు పలు మినహాయింపులు
- ప్రత్యేకంగా పోర్టల్ ఏర్పాటు
న్యూఢిల్లీ: గుజరాత్, రాజస్థాన్ లలో బిపర్ జాయ్ తుఫాను బాధితులకు అండగా ఉంటామని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) ప్రకటించింది. క్లెయిమ్‌ల దరఖాస్తు విధానాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు వాటిని వేగంగా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. ఎల్ఐసీ పాలసీలతో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ లకు పలు మినహాయింపులు కల్పించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. బాధితులకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నోడల్ అధికారులుగా నియమించినట్లు వెల్లడించింది. బిపర్ జాయ్ బాధితులు క్లెయిమ్‌లు సమర్పించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను కూడా ఏర్పాటు చేసినట్లు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు.