మార్చి నాటికి షేర్లలో రూ.1.30 లక్షల కోట్లు పెట్టనున్న ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సుమారు రూ.1.30 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ  సీఈఓ  సిద్ధార్థ మహంతి ప్రకటించారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే రూ.38,000  కోట్లను  ఇన్వెస్ట్ చేశామని పేర్కొన్నారు. కిందటేడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.23,300 కోట్లను ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ షేర్లలో పెట్టింది.  ఈ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కేవలం ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ల ద్వారానే  రూ.15,500 కోట్ల ప్రాఫిట్ సాధించింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే ఇది 13.5 శాతం ఎక్కువ. ‘మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను,  ధరల కదలికలను గమనిస్తున్నాం. 

కనీసం కిందటేడాది ఇన్వెస్ట్ చేసినంత ఫండ్స్‌‌‌‌నైనా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెడతాం. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ రూ.1.32 లక్షల కోట్లను షేర్లలో ఇన్వెస్ట్ చేసింది’ అని మహంతి అన్నారు.  ఈ ఏడాది జూన్ నాటికి 282 కంపెనీల్లో ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ పెట్టుబడులు రూ.15 లక్షల కోట్లకు పెరిగాయని చెప్పారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ చేసిన మొత్తం పెట్టుబడులు అంటే బాండ్లు, ఈక్విటీలు, ఇతర పెట్టుబడులుఈ ఏడాది మార్చి నాటికి రూ.49,75,514 కోట్లకు పెరిగాయి.   ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీ అసెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండర్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (ఏయూఎం) రూ.53,58,781 కోట్లకు పెరిగింది.