5 శాతం వాటా అమ్మనున్న ఎల్​ఐసీ

5 శాతం వాటా అమ్మనున్న ఎల్​ఐసీ

న్యూఢిల్లీ: మినిమమ్​పబ్లిక్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డింగ్ (ఎంపీఎస్​) రూల్స్​కు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ)లో 5 శాతం వరకు వాటాను అమ్మవచ్చని తెలుస్తోంది. కేంద్రం ఎల్​ఐసీ  ఐపీఓ  ద్వారా మే 2022లో రూ.21వేల కోట్లను సేకరించింది. ఎల్​ఐసీ  ఐపీఓ, భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఇప్పటివరకు అతిపెద్దది. ఇష్యూను పూర్తిగా ఆఫర్ -ఫర్ -సేల్ విధానంలో నిర్వహించారు.

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐసీలో 96.5 శాతం వాటాను కలిగి ఉన్న ప్రభుత్వం, తన వాటాలో కొంత భాగాన్ని అమ్మడానికి ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఓ),  క్వాలిఫైడ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ (క్యూఐపీ) వంటి విధానాలను పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎల్​ఐసీ లిస్టింగ్ తేదీ నుంచి 10 సంవత్సరాలలోపు 25 శాతం ఎంపీఎస్​ను సాధించాలి.