అదానీ షేర్ల పతనంతో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకి రూ.8,683 కోట్ల లాస్‌‌‌‌‌‌‌‌

అదానీ షేర్ల పతనంతో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకి రూ.8,683 కోట్ల లాస్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలున్న ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకి  గురువారం రూ.8,683 కోట్ల నష్టం వచ్చింది. గౌతమ్‌‌‌‌‌‌‌‌ అదానీపై యూఎస్‌‌‌‌‌‌‌‌లో లంచం కేసు బుక్‌‌‌‌‌‌‌‌ అవ్వడంతో గ్రూప్ కంపెనీల షేర్లు గురువారం 23 శాతం వరకు పతనమయ్యాయి. ఎల్ఐసీకి  అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌, అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌,  అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌, అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌, ఏసీసీ, అంబుజా సిమెంట్‌‌‌‌‌‌‌‌లో వాటాలు ఉన్నాయి. అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌‌‌‌‌  గురువారం 23 శాతం పడడంతో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీకి రూ.2,962 కోట్లు, అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ షేర్లు పడడంతో రూ.2,959 కోట్లు,  అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు పడడంతో రూ.570 కోట్లు లాస్ వచ్చింది.  

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ  పెట్టుబడుల విలువ  గురువారం రూ.716 కోట్లు తగ్గగా, అదానీ టోటల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌లో రూ.463 కోట్లు,   ఏసీసీలో రూ.191 కోట్లు, అంబుజా సిమెంట్స్‌‌‌‌‌‌‌‌లో రూ.822 కోట్లు తగ్గింది. ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ షేర్లు గురువారం 1.44 శాతం పడి రూ.884 దగ్గర  ముగిశాయి. మరోవైపు అదానీ కంపెనీల్లో భారీగా ఇన్వెస్ట్ చేసిన యూఎస్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ జీక్యూజీ షేర్లు గురువారం 25 శాతం వరకు పతనమై ఆస్టేలియన్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌లో  1.96 ఆస్ట్రేలియన్ డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయి.

అదానీకిచ్చిన డీల్స్‌‌‌‌ను రద్దు చేసిన కెన్యా 

గౌతమ్ అదానీపై యూఎస్‌‌‌‌లో లంచం కేసు రిజిస్టర్ అవ్వడంతో   అదానీ గ్రూప్‌‌‌‌తో చేసుకున్న ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌ విస్తరణ, ఎనర్జీ  డీల్స్‌‌‌‌ను  కెన్యా ప్రభుత్వం రద్దు చేసుకుంది. ‘మా దర్యాప్తు సంస్థలు,  పార్టనర్ దేశాలు అందించిన వివరాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని కెన్యా ప్రెసిడెంట్ విలియం రూటో గురువారం ప్రకటన చేశారు.  యూఎస్ వివరాలను అందించిందని ఆయన డైరెక్ట్‌‌‌‌గా ఒప్పుకోలేదు.