ఎల్ఐసీ బీమా సఖికి యమక్రేజ్

హైదరాబాద్​, వెలుగు:  మహిళల ఎదుగుదల కోసం ఎల్​ఐసీ తీసుకొచ్చిన బీమా సఖి యోజనకు దేశవ్యాప్తంగా అద్భుత ఆదరణ కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబరులో హర్యానా పానిపట్​లో యోజనను ప్రారంభించారు. 

ఇప్పటి వరకు 52,511 రిజిస్ట్రేషన్లు కాగా, 27,695 అపాయింట్​మెంట్​ లెటర్లు జారీ అయ్యాయి. హైదరాబాద్​ జోనల్​ మేనేజర్​పునీత్​ కుమార్ ​మాట్లాడుతూ సౌత్​ సెంట్రల్​ జోన్​లో 12,201 అప్లికేషన్లు వచ్చాయని, 6,284 మందికి అపాయింట్​మెంట్​లెటర్లు ఇచ్చామని చెప్పారు.

 ఇప్పటికే మూడు వేల మంది స్టైపైండ్​తోపాటు పాలసీల అమ్మకాలపై కమీషన్​ పొందుతున్నారని ప్రకటించారు. పదో తరగతి పాసై 18–70 మధ్య వయసున్న మహిళలందరూ బీమా సఖిగా చేరవచ్చని చెప్పారు. వీరికి మూడేళ్లపాటు నెలకు రూ.ఏడు వేల చొప్పున స్టైపెండ్​ఇస్తామన్నారు.