ఎల్ఐసీ డిజిటల్ బాట..కస్టమర్లకోసం డైవ్​ప్లాట్ఫాం

ఎల్ఐసీ డిజిటల్ బాట..కస్టమర్లకోసం డైవ్​ప్లాట్ఫాం
  • అందుబాటులోకి ఎల్‌ఐసీ డైవ్ ప్లాట్ఫామ్

న్యూఢిల్లీ:భారతదేశపు అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్​ఐసీ తన వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి డిజిటల్ బాట పట్టింది. ఇందుకోసం ఇన్నోవేషన్ అండ్ వాల్యూ ఎన్‌‌‌‌హాన్స్‌‌‌‌మెంట్ (డైవ్​) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ఎల్ఐసీ తన కార్యకలాపాలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తుంది. ఈ కార్యక్రమం కింద, ఎల్ఐసీ తన వినియోగదారుల కోసం కొత్త డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను అభివృద్ధి చేస్తోంది.

దీని ద్వారా వినియోగదారులు తమ పాలసీల గురించి సమాచారం పొందడం, ప్రీమియం చెల్లించడం, క్లెయిమ్‌‌‌‌లు దాఖలు చేయడం వంటి అనేక సేవలను సులభంగా పొందవచ్చు. ఏజెంట్ల కోసం కూడా ప్రత్యేకంగా ఒక డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా ఏజెంట్లు తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చు.

ఈ మార్కెటింగ్​ టెక్నాలజీ ప్లాట్​ఫామ్​వల్ల బీమా పరిశ్రమలో ప్రపంచ డిజిటల్ చాంపియన్‌‌‌‌గా ఎదగడం వీలవుతుందని ఎల్​ఐసీ తెలిపింది. డైవ్​ ప్రపంచ స్థాయి టెక్నాలజీని ఉపయోగించి కస్టమర్ ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను మరింత మెరుగ్గా మారుస్తుందని ఎల్​ఐసీ భావిస్తోంది. డైవ్​ వల్ల పాలసీదారులు, ప్రాస్పెక్ట్‌‌‌‌లు,  ఏజెంట్లతో కనెక్ట్ అయ్యే  సామర్థ్యాన్ని బలపరుస్తుందని ఎల్ఐసీ ఎండీ, సీఈఓ సిద్ధార్థ మొహంతి అన్నారు.