ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్‌‌ బ్యాంక్‌‌లో 2.68 శాతానికి పెరిగిన ఎల్‌‌ఐసీ వాటా

ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్‌‌ బ్యాంక్‌‌లో 2.68 శాతానికి పెరిగిన ఎల్‌‌ఐసీ వాటా

న్యూఢిల్లీ: ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్‌‌లో తన వాటాను 2.68 శాతానికి ఎల్‌‌ఐసీ పెంచుకుంది. తాజాగా  రూ.83.63 కోట్లకు 0.2 శాతం వాటాను కొనుగోలు చేసింది.  ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లను  1,42,01,484 నుంచి 20,02,36,384 పెంచుకోవడంతో ఎల్‌‌ఐసీ వాటా 0.20 శాతం పెరిగి 2.68 శాతానికి చేరుకుందని ఈ ఇన్సూరెన్స్ కంపెనీ  రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో పేర్కొంది. ఎల్‌‌ఐసీ షేర్లు  గురువారం సెషన్‌‌లో 2.25 శాతం పెరిగి రూ.1,010 దగ్గర క్లోజయ్యాయి. ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు 0.40 శాతం పెరిగి రూ.81.9 దగ్గర ముగిశాయి.