విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్ -3 సినిమా ఈ నెల 27న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రాగా.. ఇవాళ పూజా హేగ్దే స్పెషల్ సాంగ్ ను కూడా వదిలింది యూనిట్. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ లైఫ్ అంటే మినిమమ్ ఇట్లా ఉండాలా పాటను విడుదల చేసింది. ఈ పాటలో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు పూజా హెగ్డే వేసిన స్టెప్పులు హైలైట్ గా ఉన్నాయి. ఈ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్, గీతా మాధురి ఆలపించారు. ఈ పాటతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొందంటున్నారు ఫ్యాన్స్. విడుదలైన పార్టీ సాంగ్ లో పూజా హెగ్డే డ్యాన్స్ అద్దిరిపోయిందంటున్నారు. రంగస్థలం తర్వాత పూజా హెగ్డే చేసిన మరో స్పెషల్ సాంగ్ ఇది కావడం విశేషం.
వెంకటేష్, వరుణ్ తేజ్ లు కూడా ఈ పాటలో అద్భుతమైన స్టెప్పులు వేశారని ఇద్దరి అభిమానులు మురిసిపోతున్నారు. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన విషయం తెలిసిందే. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో తమన్నా భాటియా, మెహ్రిన్ లు హీరోయిన్స్ గా నటించారు. సోనాల్ చౌహాన్ మరో కీలక పాత్రలో మెరవబోతుండగా.. సునీల్ కూడా కీ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మూడేళ్ల క్రితం వచ్చిన ఎఫ్2 సినిమాకి సీక్వెల్.
Come join the #F3Movie
— Venkatesh Daggubati (@VenkyMama) May 17, 2022
party! ??#LifeAnteIttaVundaala Lyrical Song ft. @hegdepooja??
▶️ https://t.co/1Tes3GQ2m1@IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @Rahulsipligunj @geethasinger @LyricsShyam @SVC_official @adityamusic #F3OnMay27 pic.twitter.com/9VwQh2SkC8