- తెలంగాణ యాంటీ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య
ఎల్బీనగర్, వెలుగు: డ్రగ్స్ జోలికి వెళ్తే జీవితాలు నాశనమవుతాయని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. మంగళవారం హయత్ నగర్ లోని ఓ స్కూల్ లో తెలంగాణ బెటాలియన్ ఎన్ సీసీ ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సందీప్ శాండిల్య పాల్గొని స్టూడెంట్లకు డ్రగ్స్ తో కలిగే అనర్థాలను వివరించారు. న్యూఇయర్సెలబ్రేషన్స్పై నిఘా పెట్టేందుకు ప్రత్యేకమైన టీములను ఏర్పాటు చేశామన్నారు.
హోటల్స్, పబ్స్, రిసార్ట్స్, రెస్టారెంట్లలో స్నీఫర్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్ వింగ్ డీఎస్ పీ రమేశ్, డీఎస్పీ సుబ్బరామిరెడ్డి, ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్, రాంప్రసాద్, తెలంగాణ ఎన్ సీసీ థర్డ్ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ శరత్ తుపురాని, కల్నల్ మంజుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.