ఓ వ్యక్తికి సడెన్గా హార్ట్ అటాక్ వచ్చింది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టడంతో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. డాక్టర్లు వైద్యం చేశారు కానీ ఫలితం లేకుండా పోయింది. అతడు చనిపోయాడు అని ప్రకటించారు. కానీ ఇక్కడో మిరాకిల్ జరిగింది. చనిపోయి వ్యక్తి గంట తర్వాత మళ్లీ బతికొచ్చాడు. దాదాపు గంట పాటు గుండె ఆగిపోయి రెండుస్లారు మరణించిన వ్యక్తి.. అద్భుతంగా కోలుకొని ఆశ్చర్య పర్చాడు. అతను ఎలా బతికాడు.. ఎక్కడ ఈ సంఘటన జరిగిందో చచ్చి బతికిన ఆ మనిషి కథేంటో తెలుసుకుందాం రండి.
అది ఇంగ్లండ్ లోని హంబర్ ప్రాంతంలోని దక్షిణ యార్క్ షేర్ కౌంటీ. ఈ ప్రాంతానికి చెందిన బెన్ విల్సన్ (31) .. 2023 జూన్ లో అతని ఇంట్లో కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యాడు. అతని గుండె 50 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు ఆగిపోవడంతో అతనిని తిరిగి బతికించేందుకు పారామెడిక్స్ అతని గుండెకు 17 సార్లు షాక్ ఇవ్వాల్సి వచ్చింది. అత్యవసర శస్త్ర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అతడు ఐదు వారాలపాటు కోమాలోకి వెళ్లాడు. బెన్ ఎంతో కాలం బతకడని చెప్పారు. అతని భార్య రెబెక్కా ఆశలు వదులుకుంది.
బెన్ భార్య రెబెక్కా తన భర్త పరిస్థితి చూసి తల్లడిల్లి పోయింది. బెన్ అంటే రెబెక్కా కు ఎంతో ఇష్టం. ప్రాణం కూడా. తన భర్త చనిపోయాడని విలపిస్తూ తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసు కుంటూ ఏడుస్తుంది. తన భర్త బెన్ కు ఇష్టమైన డ్రీమ్ ఎ లిటిల్ డ్రీమ్ఆఫ్ మీ అనే పాటను పాడుతుంది. అతని దిండుపై పెర్ఫ్యూమ్ ను స్ర్పే చేసింది. బెన్ తనకు బహుమతిగా ఇచ్చిన టెడ్డీ బేర్ ను అతని పక్కనే ఉందిచ లవ్ యూ టు ది మూన్ అండ్ బ్యాక్ అని పదాలు ఉంచింది. అయితే సడెన్ గా గంట తర్వాత చనిపోయాడనుకున్న బెన్ వైద్యులను, రెబెక్కా,అతని కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తూ.. లేచి కూర్చున్నాడు.
ALSO READ :- health tips: అరటిపండ్లు అతిగా తింటే ఏమవుతుంది? రోజుకు ఎన్ని అరటిపండ్లు తినొచ్చు?
నా ప్రేమ బెన్ ను తిరిగి బతికించిందని అతని భార్య రెబెక్కా గట్టిగా నమ్ముతోంది. అద్బుతం .. శారీరక స్పర్శ, ప్రేమ, సానుకూల ప్రభావాన్ని చూపుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయని రెబెక్కా చెప్పారు. ఎప్పుడూ హార్ట్ ఫుల్ గా రొమాంటిక్ గా ఉండే బెన్.. నాకు పువ్వులు , కార్డులతో ప్రేమ వర్షం కురిపించేవాడని.. మేం కలిసి ఉన్న ఏడేళ్లలో అతను నాపై చూపి ప్రేమ , ఆప్యాయతను తిరిగి ఇస్తున్నట్లు నాకు అనిపించిందని రెబెక్కా సంతోషం వ్యక్తం చేసింది. ఇక చచ్చి బతికి వచ్చిన బెన్ విల్సన్ .. జీవితం తనకు రెండో అవకాశం ఇచ్చిందని కృతజ్ణతలు తెలిపాడు.