ఆమనగల్లు, వెలుగు : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం నార్లకుంట తండాలో భూవివాదంలో జరిగిన హత్య కేసులో కొడుకు, కోడలికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల చొప్పున కోర్టు జరిమానా విధించింది. శుక్రవారం ఎల్బీ నగర్ తొమ్మిదో అదనపు జిల్లా న్యాయమూర్తి హర్ష ఈ తీర్పు ఇచ్చారని కడ్తాల్ సీఐ శివప్రసాద్ తెలిపారు. నార్లకుంట తండాకు చెందిన జటావత్ బిచాలికి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు.
భూతగాదాలు జరగడంతో 2021 జూన్11న రాత్రి బిచాలిని ఆమె కొడుకు కిషన్, కోడలు విజయ కలిసి హత్య చేశారు. మృతురాలి కూతురు సుశీల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారని సీఐ వెల్లడించారు.