ఎల్బీనగర్: భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా రెండో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రవళ్లిక, మెండం పుల్లయ్య భార్యాభర్తలు. ఓ మైనర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవళ్లిక.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్ప్రకారం 2016 మే 26న రాత్రి భర్త పుల్లయ్యతో గొడవపడి తన ప్రియుడితో కలిసి భర్తపై దాడిచేసి చంపేసింది. తర్వాత డెడ్‌బాడీని ఇద్దరూ కలిసి నల్గొండ వైపు బైక్‌పై తీసుకెళ్తుండగా..
పెద్ద అంబర్‌పేట నైట్ పెట్రోలింగ్ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసు ఫైల్ చేసి ఎల్బీనగర్కు బదిలీ చేశారు. ప్రవళ్లిక తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో భాగంగా సోమవారం మహిళను ప్రధాన నిందితురాలిగా గుర్తించిన రంగారెడ్డి జిల్లా రెండో అదనపు కోర్టు.. ఆమెకు జీవిత ఖైదు, రూ.వెయ్యి ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పింది.