
MWP Clause: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జీవితాల్లో విషాదాన్ని నింపింది. ఆర్థికంగా కూడా చాలా కుటుంబాలను ఇది కుదిపేసిన సంఘటనలు ఉన్నాయి. అయితే భారతదేశంలోని ప్రజలు సైతం దీని నుంచి చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు. అప్పటి నుంచే ప్రజల్లో ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతపై అవగాహన భారీగా పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్న వారు ఆర్థికంగా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవటం వాటిపై దృష్టి పెట్టని వారికి ప్రాముఖ్యతను తెలియజేసింది.
వాస్తవానికి ఏజెంట్ చెప్పాడనో లేక తెలిసిన వారు కొన్నారనో చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను గుడ్డిగా కొంటుంటారు. అయితే ఎప్పుడైనా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు దాని వల్ల కలిగే ప్రయోజనాలు, వాటికి ఉండే నిబంధనలు, ఇతర బెనిఫిట్స్ గురించి చర్చించిన తర్వాత అవసరమైన అదనపు రైడర్లను జోడించటం లాంటి నిర్ణయాలు పాలసీదారులు వాటిని కొనే సమయంలోనే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. కానీ చాలా మంది ఈ వివరాలను తెలుసుకోకపోవటంతో తర్వాత అనుకోని సంఘటనతో పాలసీదారు మరణించినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తిరస్కరణలను ఎదుర్కొంటున్న పరిస్థితులు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ఉండే కీలకమైన నిబంధన MWP(మ్యారీడ్ ఉమెన్స్ ప్రాపర్టీ) గురించి తెలుసుకుందా. 99 శాతం మంది పాలసీదారులకు దీని ప్రయోజనం గురించి తెలియకపోవటంతో తర్వాత ఇబ్బందుల పాలవుతున్నారు. పాలసీ కొనుగోలు సమయంలో దీనిని యాడ్ చేసుకోవటం ద్వారా అనుకోకుండా పాలసీదారు మరణించినప్పుడు వారి భార్య, పిల్లలకు ఆర్థికంగా అండగా నిలబడుతుంది. పాలసీదారు బ్రతికి ఉన్న సమయంలో తీసుకున్న ఏవైనా లోన్స్, ఇతర రుణాలకు సంబంధించిన చెల్లింపులను ఈ పాలసీ మెుత్తం నుంచి క్లెయిమ్ చేయటానికి అనుమతిని ఈ MWP నిబంధన అడ్డుకుంటుంది. అంటే పాలసీ సెలిట్మెంట్ ద్వారా వచ్చే మెుత్తం డబ్బు సదరు వ్యక్తి ఫ్యామిలీకి మాత్రమే చట్టప్రకారం చెందుతుంది. దీనిని అడ్డుకోవటం లేదా దీని నుంచి ఆయన చేసిన అప్పుల పెండింగ్ మెుత్తాలను జమ చేయటం లాంటివి కుదరదు.
►ALSO READ | Gold Rate: ఉగాదికి ముందు బంగారం భారీ ర్యాలీ, తులానికి రూ.220 అప్.. తగ్గిన వెండి
ఒక వేళ పాలసీదారులు తమ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద MWP క్లాస్ ఎంపిక చేసుకోకపోతే అనుకోకుండా అతడు మరణించిన సమయంలో అప్పటి వరకు ఉన్న ఏదైనా లోన్స్ లేదా రుణాలకు సంబంధించిన చెల్లింపులను దీని నుంచి రుణదాతలు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో ఆ పాలసీ ప్రయోజనాలు మరణించిన వ్యక్తి కుటుంబానికి అందకపోవచ్చు. అందువల్ల ఈ క్లాజ్ తప్పనిసరిగా ఎంపిక చేసుకోవటం ఉత్తమం.
MWP నిబంధన ప్రయోజనాలు..
రుణదాతల నుంచి రక్షణ: పాలసీదారుడు మరణించిన తర్వాత, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాన్ని అప్పులు తీర్చడానికి ఉపయోగించకూడదని MWP నిబంధన నిర్ధారిస్తుంది. రుణాలు, అప్పులు లేదా ఆర్థిక బాధ్యతలు ఉన్న వ్యాపారాలు లేదా వృత్తుల్లోని వ్యక్తులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
కుటుంబ భద్రతకు హామీ: నిబంధన ప్రధాన ప్రయోజనం ఏమిటంటే లైఫ్ ఇన్సూరెన్స్ చెల్లింపు ప్రత్యేకంగా పాలసీదారుని కుటుంబం అంటే.. భార్య, పిల్లల ప్రయోజనం కోసం రూపొందించబడింది. చట్టపరమైన సమస్యలు లేదా రుణదాతల జోక్యం లేకుండా కుటుంబం పాలసీ పూర్తి ఆర్థిక ప్రయోజనాన్ని పొందేందుకు సహాయపడుతుంది.
లబ్ధిదారుని హోదాలో సరళత: చాలా సందర్భాలలో లబ్ధిదారుడు భార్య, కుటుంబ ప్రాథమిక సంరక్షకుడు లేదా ఆర్థిక మద్దతుదారు నిధులను అందుకునేలా ఇది చేస్తుంది. అయితే దీనిని మరణించిన వ్యక్తి పిల్లలు లేదా ఇతర ప్రియమైనవారికి కూడా వర్తిపంజేసుకోవచ్చు.
ఎస్టేట్ ప్లానింగ్: MWP నిబంధన ఆస్తులను కుటుంబానికి సజావుగా బదిలీ చేయడంలో కూడా సహాయపడుతుంది.
మనశ్శాంతి: పాలసీ ప్రయోజనాలు సురక్షితంగా చట్టపరమైన క్లెయిమ్‌లను అందిస్తుంది. అలాగే రుణదాతల నుంచి రక్షించబడ్డాయని తెలుసుకోవడం పాలసీదారునితో పాటు అంతిమ లబ్ధిదారులైన కుటుంబ సభ్యులకు మనశ్శాంతిని అందిస్తుంది.